Ration Cards Update: తెలంగాణలో ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నవారికి ఒక కొత్త అప్‌డేట్. కొత్తగా తమ కుటుంబ సభ్యుల పేర్లను రేషన్ కార్డుల్లో చేర్చాలంటూ ఎంతోమంది దరఖాస్తులు చేసుకున్నారు. వారందరి పేర్లు యాడ్ అయితే, రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలకు ప్రతినెలా అదనంగా రేషన్ బియ్యం అందుతుంది. వివరాలివీ..
Also Read :Meenakshi Natarajan : మీనాక్షి నటరాజన్ ఎవరు ? ఆమె మొదటి టార్గెట్ అదేనా ?
బీఆర్ఎస్ హయాంలో పట్టింపు కరువు
బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాటు సంక్షేమ పాలన అందించాం అని చెబుతోంది. కానీ ఆ పాలనలో కనీసం రేషన్ కార్డుల(Ration Cards Update) అప్డేట్ కోసం ప్రజలకు అవకాశమే ఇవ్వలేదు. కేవలం బడా కాంట్రాక్టర్లకు పనులను అప్పగించే ప్రాజెక్టులపై మాత్రమే ఆనాడు ఫోకస్ పెట్టారు. ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కారు ఏర్పడ్డాక, తెలంగాణ ప్రజలకు తీపి కబురు అందింది. రేషన్ కార్డుల్లో తమ కుటుంబ సభ్యుల వివరాలను అదనంగా యాడ్ చేసుకునే ఛాన్స్ దక్కింది. ఇంట్లో కొత్తగా చేరిన సభ్యుల పేర్లను రేషన్ కార్డుల్లో చేర్చే అవకాశం లేక, ఎంతోమంది ఆరోగ్యశ్రీ లాంటి సంక్షేమ పథకాలను వినియోగించుకోలేక పోయారు. కొత్తగా పెళ్లయిన మహిళల పేర్లను, గత పదేళ్లలో జన్మించిన పిల్లల పేర్లను రేషన్ కార్డులో చేర్పించే అవకాశాన్ని ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు కల్పించింది. దీంతో భారీ సంఖ్యలో ప్రజలు దరఖాస్తులు సమర్పించారు.
Also Read :Cabinet Expansion : మంత్రివర్గ విస్తరణ ను రాహుల్ నేడు ఫైనల్ చేస్తాడా..?
18 లక్షలకుపైగా పేర్ల చేరికకు..
తెలంగాణలో 18 లక్షల మందికిపైగా పేర్లను రేషన్ కార్డుల్లో కొత్తగా చేర్చాలంటూ 12 లక్షలకుపైగా కుటుంబాల నుంచి రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు అప్లికేషన్లు అందాయి. వాటిని పరిశీలించిన అధికారులు 6.68 లక్షల కుటుంబాలు మాత్రమే ఈ మార్పులు, చేర్పులకు అర్హమైనవని ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఆధారంగా గుర్తించారు. ఆధార్ కార్డు నంబరు ఆధారంగా.. వారి పేర్లు ఇతర రేషన్ కార్డుల్లో ఉన్నాయా అనేది సివిల్ సప్లై అధికారులు పరిశీలించారు. ఈ నెలాఖరులోగా కొత్తగా 1.30 లక్షల లబ్ధిదారుల పేర్లను పాత రేషన్ కార్డులో చేర్చబోతున్నారు. కొత్తగా కార్డుల్లో చేర్చిన వారికి 6 కిలోలు చొప్పున బియ్యాన్ని అందిస్తారు. ఇందుకోసం ప్రభుత్వంపై ఏడాదికి రూ.32 కోట్ల దాకా ఆర్థిక భారం పడుతుందని అంచనా.