Site icon HashtagU Telugu

Hydraa : హైడ్రాకు కొత్త బాధ్యతలు

New Responsibilities For Hy

New Responsibilities For Hy

తెలంగాణ(Telangana)లో ఇసుక సరఫరా(Supply of Sand), అక్రమ రవాణా వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇసుక రీచ్‌ల వద్ద నిఘా పెంచాలని, అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని అధికారులను ఆదేశించారు. గనులు, ఖనిజాభివృద్ధి సంస్థ పనితీరును సమీక్షించిన రేవంత్ రెడ్డి, హైదరాబాద్ పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణా నియంత్రణ బాధ్యతలను హైడ్రా కమిషన్‌(Hydra Commission)కు అప్పగించారు.

Musk Vs Altman: ఓపెన్ ఏఐను కొనేస్తానన్న మస్క్.. ఎక్స్‌ను కొనేస్తానన్న శామ్‌ ఆల్ట్‌మన్‌

ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇతర ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అక్రమ రవాణా కేసుల్లో ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సాధారణ ప్రజలకు తక్కువ ధరకు ఇసుక లభించేలా సరఫరా వ్యవస్థను పటిష్టంగా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. ఇసుక బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు జిల్లాల వారీగా కలెక్టర్లు, ఎస్పీలకు ప్రత్యేక అధికారాలు అప్పగించారు. అంతేకాకుండా, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ నిఘా బృందాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు 360 డిగ్రీల కెమెరాలు, సోలార్ లైట్లు, స్టాక్ యార్డుల వద్ద ఫెన్సింగ్, ప్రత్యేక ఎంట్రీ-ఎగ్జిట్ లైన్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అధికారుల కఠిన చర్యలు లేకుండా ఇసుక సరఫరా పూర్తిగా పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో తాను స్వయంగా ఆకస్మిక తనిఖీలు కూడా చేపడతానని హెచ్చరించారు. ఇసుక సరఫరా వ్యవస్థను పూర్తి స్థాయిలో పారదర్శకంగా మార్చేందుకు రిజిస్టర్డ్ లారీలను ఎంప్యానెల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.