Site icon HashtagU Telugu

KBR Park: కేబీఆర్‌ పార్క్‌లో నూతన మల్టీ లెవల్‌ పార్కింగ్‌ భవనం

Kbr Park

Kbr Park

హైదరాబాద్‌ నగరంలో పార్కింగ్‌ సమస్యలకు పరిష్కారం చూపే ప్రయత్నంగా, జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్‌ పార్క్‌ (KBR Park) వద్ద మల్టీ లెవల్‌ మెకనైజ్డ్‌ పార్కింగ్‌ సదుపాయాన్ని నిర్మిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఇది పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) మోడల్‌లో, డిజైన్‌, బిల్డ్‌, ఫైనాన్స్‌, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (DBFOT) పద్ధతిలో నిర్మాణం జరగనుంది. ఈ పార్కింగ్‌ 2025 జూన్ మొదటి వారంలో ప్రజలకు అందుబాటులోకి రానుంది.

AP Formula : తమిళనాడు ఎన్నికల్లో ఏపీ ఫార్ములా.. ట్విస్ట్ ఇవ్వనున్న విజయ్‌ ?!

ఈ పార్కింగ్ సదుపాయం మొత్తం 72 కార్లకు సమానమైన స్థలాన్ని (Equivalent Car Spaces – ECS) కలిగి ఉంటుంది. ఇందులో 20 శాతం ద్విచక్ర వాహనాల కోసం ప్రత్యేకంగా కేటాయించనున్నారు. భవనం 15 మీటర్ల ఎత్తు గల రొటరీ సిస్టమ్‌తో నిర్మించబడుతుంది. మొత్తం 6 యూనిట్లు ఉంటాయి, ప్రతి యూనిట్ 12 వాహనాలు నిల్వ చేయగలదు. ఇది ఒక ఆధునిక టెక్నాలజీ ఆధారిత వ్యవస్థగా రూపొందించబడుతుంది.

పార్కింగ్‌లో ఖాళీ స్థలాల సమాచారాన్ని మొబైల్ యాప్ ద్వారా రియల్ టైమ్‌లో తెలుసుకోవచ్చు. స్మార్ట్ కార్డ్ టికెటింగ్, ఆన్‌లైన్ చెల్లింపులు, గూగుల్ మ్యాప్స్ ఇంటిగ్రేషన్ వంటి సదుపాయాలు ఉండబోతున్నాయి. అంతేకాదు, మొత్తం ప్రాంతంలో 20 శాతం భాగాన్ని అమెనిటీస్ కోసం కేటాయిస్తున్నారు, ఇందులో కాఫీ కియోస్కులు, ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ పాయింట్లు, మినీ మార్ట్లు ఉండనున్నాయి. ఈ పార్కింగ్ సెంటర్ ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ తెరిచి ఉంటుంది. ఇది GHMC ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 50 మెకనైజ్డ్ పార్కింగ్ కేంద్రాల్లో ఒకటిగా పేరుగడుతోంది.