T-SAT: టీశాట్‌కు కొత్త సీఈఓ.. ఎవ‌రో తెలుసా..?

ప్రముఖ జర్నలిస్ట్ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డిని టీశాట్ (T-SAT) సీఈఓగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • Written By:
  • Updated On - March 5, 2024 / 08:38 PM IST

T-SAT: ప్రముఖ జర్నలిస్ట్ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డిని టీశాట్ (T-SAT) సీఈఓగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ స్కిల్, ఎకడమిక్ అండ్ ట్రైనింగ్ సాటిలైట్ టీవీ అయిన T-SAT ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న విష‌యం మ‌న‌కు తెలిసిందే.

ఎవ‌రీ వేణుగోపాల్ రెడ్డి..?

టీశాట్ సీఈఓగా నియమితులైన బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి స్వస్థలం ప్రస్తుత నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునూతల మండలం కొరటికల్ గ్రామం. వేణుగోపాల్ రెడ్డి తెలంగాణ యూనివర్సిటీలో ఎంఏ మాస్ కమ్యూనికేషన్ చదివారు. విద్యార్థి దశలో తెలంగాణ యూనివర్సిటీలో ఎన్.ఎస్.యూ.ఐ అధ్యక్షుడిగా పనిచేశారు. జర్నలిజంలో 17 సంవత్సరాల అనుభవం ఉన్న వేణుగోపాల్ రెడ్డి.. తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా పనిచేశారు. హైదరాబాద్, ఢిల్లీలో ఉద్యమ వార్తలకు విస్తృత కవరేజీ వచ్చేలా కృషి చేశారు.

తెలంగాణ వచ్చిన తరువాత కూడా పాత్రికేయరంగంలో వేణుగోపాల్ రెడ్డి యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. గత మూడు సంవత్సరాలుగా తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడిగా అనేక సమస్యలపై పోరాటం చేస్తూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. వాటి పరిష్కారానికి పనిచేశారు. మీడియాలో ఉన్న విస్తృత పరిచయాలతో ప్రజల సమస్యలపై బలమైన గొంతు వినిపించారు. అనేక సమస్యల పరిష్కారంలో వేణుగోపాల్ రెడ్డి చొరవ చూపించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో మేధావులు, బుద్దిజీవులతో అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు, సెమినార్ లు నిర్వహించారు. అధికార, ప్రతిపక్ష నాయకులను సైతం ఈ చర్చ వేదికల్లో భాగస్వాములను చేశారు.

Also Read: BJP MP Upendra Singh : రాసలీలల వీడియో నాకు పంపించండి చూస్తాను – నటి కస్తూరి

తెలంగాణ పౌరసమాజంలో ప్రశ్నించే గొంతుకగా వేణుగోపాల్ రెడ్డి నిలిచారు. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం ప్రముఖ దినపత్రికల్లో ఆర్టికల్స్ రాశారు. ఏదో ఒక పార్టీకి అనుబంధంగా కాకుండా ఎల్లప్పుడూ ప్రజల పక్షంగానే నిలిచారు. విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై సమగ్ర అవగాహన ఉన్న వేణుగోపాల్ రెడ్డిని.. టీశాట్ సీఈఓగా రాష్ట్ర ప్రభుత్వం నియమించటంపై అభినందనీయ‌మ‌ని ప‌లువురు జ‌ర్న‌లిస్టులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

We’re now on WhatsApp : Click to Join