తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల (BJP Presidents) నియామకం కోసం వేచిచూస్తున్న ఎదురుచూపులకు తెరపడే సమయం ఆసన్నమైంది. జూలై 1న రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ ముగుస్తుందని బీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ ఎన్నికల కోసం అధికారిగా లక్ష్మణ్‌ను నియమించినట్టు హైకమాండ్ ప్రకటించింది. అయితే ఇది కేవలం ఒక అధికారిక ప్రక్రియ మాత్రమేనని, అసలు ఎంపికలు ఇప్పటికే పూర్తయ్యాయని సమాచారం. ఎంపికైన వారికి జూలై 1న నామినేషన్ వేయాలని సూచించనున్నారు. వారు తప్ప ఇతరులు పోటీ చేయడానికే వీలులేదు అనేలా వ్యవస్థను సెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
Mahaa News : మహాన్యూస్ ఆఫీస్ పై దాడి..లోపల ఫేమస్ హీరో
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈటల రాజేందర్ పటిష్టంగా రేసులో ఉన్నప్పటికీ, ఆయనకు వ్యతిరేకంగా బలమైన వర్గం పని చేస్తోంది. మరోవైపు మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పేరు మళ్లీ తెరపైకి వచ్చినట్టు సమాచారం. అలాగే పలువురు సీనియర్ నేతలు కూడా ఈ పదవి కోసం ప్రయత్నాలు చేశారు. అయితే ఆఖరికి హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపిందన్నది జూలై 1న అధికారికంగా తెలిసే అవకాశం ఉంది.
Travel Destinations: భారతదేశంలోని ఈ అందమైన ప్రదేశాలకు ఒక్కసారైనా వెళ్లారా?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం పురందేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఆమెను కొనసాగించేలా హైకమాండ్ ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే రాయలసీమకు చెందిన రెడ్డి సామాజిక వర్గానికి ఈ పదవి ఇవ్వాలన్న లాబీయింగ్ కూడా బలంగా ఉంది. అధికార కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంతో ప్రాముఖ్యంగా మారడంతో పలువురు నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎవరి వ్యూహం పని చేస్తుందో, జూలై 1న తెరపైకి రానుంది.