Site icon HashtagU Telugu

Kavithas Bail : ఈడీ కేసులో కవితకు బెయిల్.. వాదోపవాదనల వివరాలివీ

MLC Kavitha remand extended for another 14 days

Kavithas Bail : ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నమోదు చేసిన కేసులో కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. కానీ సీబీఐ కేసులో ఇంకా బెయిల్ రాలేదు. అంతకుముందు  కవితకు బెయిల్‌పై బీఆర్ఎస్ శ్రేణుల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టులో కవిత తరఫున ముకుల్ రోహత్గీ  వాదనలు వినిపించారు. వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

ఈడీ నోటీస్‌ రాగానే అన్ని ఫోన్లను కవిత ధ్వంసం చేశారని ఈడీ తరపు లాయర్లు ఆరోపించారు. ప్రజలు ఫోన్లు, కార్లు మారుస్తూ ఉంటారు అది కామనే అని కవిత తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ తెలిపారు. దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను కూడా కవిత(Kavithas Bail) అప్పగించారని రోహత్గీ చెప్పారు. ఈక్రమంలో జోక్యం చేసుకున్న సుప్రీంకోర్టు బెంచ్.. ప్రతిరోజు ఫోన్లు మారుస్తారా..? అని ప్రశ్నించింది. ఫోన్లను ఫార్మాట్‌ చేసి ఇంట్లో పని చేసే వారికి ఇచ్చారని ఈడీ తరపు లాయర్లు తెలిపారు. సాక్ష్యాలను కూడా కవిత తారుమారు చేశారన్నారు. ఫోన్లలో ఉన్న సమాచారం కూడా ధ్వంసం చేశారని చెప్పారు. విచారణ సమయంలో కవిత సహకరించలేదని వాదించారు.

Also Read :Bairanpally : బైరాన్‌పల్లిలో రజాకార్ల నరమేధానికి నేటితో 76 ఏళ్లు

ఇక కవిత తరఫున వాదనలు వినిపిస్తున్న ముకుల్‌ రోహత్గీ.. బెయిల్ పొందేందుకు కవిత అర్హురాలే అని చెప్పారు. ఈడీ కేసులో కవిత 5 నెలలుగా జైలులో ఉన్నారని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ఇప్పటిదాకా 493 మంది సాక్షులను విచారించారని చెప్పారు. ఈ కేసులో ఛార్జ్‌ షీట్లు దాఖలు ప్రక్రియ కూడా పూర్తయిందన్నారు. కవిత దేశం విడిచి పారిపోయే అవకాశం లేదని పేర్కొన్నారు. ‘‘ఈడీ, సీబీఐ కేసుల్లో విచారణ ఇప్పటికే పూర్తయ్యింది. ఓ మహిళగా బెయిల్‌కు కవిత అర్హురాలు. ఎక్కడకీ వెళ్లరు..?’’ అని ముకుల్‌ రోహత్గీ తెలిపారు. కవిత నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సొమ్ము రికవరీ చేయలేదని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ కవిత ఎవరినీ బెదిరించలేదన్నారు. ‘‘ఇదే కేసులో మనీశ్‌ సిసోదియాకు బెయిల్‌ మంజూరైంది..సిసోదియాకు వర్తించిన నిబంధనలే కవితకు వర్తిస్తాయి’’ అని రోహత్గీ తెలిపారు. కవిత బెయిల్‌ పిటిషన్‌పై దర్యాప్తు సంస్థల తరఫున లాయర్‌ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ.. ఫోన్లలో ఉన్న డేటాను కవిత ఫార్మాట్‌ చేశారని చెప్పారు. ఆధారాలు, సాక్ష్యాలు కవిత మాయం చేశారని ఆరోపించారు. దర్యాప్తునకు సహకరించడం లేదని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఆమెకు బెయిల్‌ ఎలా ఇస్తారని వ్యాఖ్యానించారు.

Also Read :Kangana Ranaut : కంగన ‘ఎమర్జెన్సీ’కి వ్యతిరేకంగా వీడియో వార్నింగ్.. అందులో ఏముంది?