MLC Candidates: తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యంను సీపీఐ పార్టీ ప్రకటించింది. సత్యం పేరును నల్గొండ జిల్లా సీపీఐ ఇన్‌ఛార్జి పల్లా వెంకట్‌రెడ్డి ప్రతిపాదించారు. మరో సీనియర్‌నేత చాడ వెంకట్‌రెడ్డి పేరును కూడా ప్రతిపాదించారు. అయితే తాను పోటీలో ఉండటం లేదని చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. దీంతో సత్యం పేరును సీపీఐ రాష్ట్ర కార్యవర్గం ఖరారు చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు స్థానంలో పోటీ చేయాలని సీపీఐ భావించింది. అయితే ఆ స్థానాన్ని కాంగ్రెస్ తీసుకొని, కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. భవిష్యత్తులో ఒక ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని అప్పట్లో సీపీఐకి కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. దాని ప్రకారమే ఇప్పుడు నడుచుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరును కేసీఆర్ అనౌన్స్ చేశారు. దీంతో అన్ని పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో క్లారిటీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా(MLC Candidates) అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్‌లకు అవకాశం దక్కిన సంగతి తెలిసిందే.
Also Read :TDP MLC Candidates: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ!
నెల్లికంటి సత్యం గురించి..
- నెల్లికంటి సత్యం మునుగోడు మండలం ఎల్లలగూడెంలో 1969లో జన్మించారు.
- ఆయన పొలిటికల్ సైన్స్‌లో పీజీ చేశారు.
- బీసీ వర్గానికి చెందిన సీపీఐ నాయకుడు.
- 1985 నుంచి 2019 వరకు వివిధ హోదాల్లో పార్టీలో పనిచేశారు.
- నెల్లికంటి సత్యం 2020 నుంచి సీపీఐ నల్గొండ జిల్లా కార్యదర్శిగా, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు.
Also Read :Chahal With Secret Girl: విడాకుల తర్వాత ‘మిస్టరీ గర్ల్’తో కనిపించిన చాహల్.. ఫోటో వైరల్!
దాసోజు శ్రవణ్ గురించి..
ఇవాళ ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్ నామినేషన్ వేస్తారు. బీఆర్ఎస్ తరఫున 38 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. అయితే వారిలో 10 మంది కాంగ్రెస్‌లో చేరారు. కానీ అధికారికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కంటిన్యూ అవుతున్నారు. ఒకవేళ ఆ 10 మంది శ్రవణ్‌కు ఓటు వేయకున్నా.. 28 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మద్దతు తప్పకుండా లభిస్తుంది. ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికకు 21 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అందుకే దాసోజు శ్రవణ్ ఎన్నిక లాంఛనమే. దాసోజు శ్రవణ్‌ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 జులై 31న గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా సిఫార్సు చేసింది. అయితే సాంకేతిక కారణాలతో నాటి గవర్నర్ తమిళిసై తిరస్కరించారు.
- దాసోజు శ్రవణ్ 1966 జూన్ 7న జన్మించారు.
- విశ్వకర్మ(బీసీ) సామాజికవర్గానికి చెందిన నేత.
- ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1987లో విద్యార్థి సంఘ నాయకుడిగా, ఆర్ట్స్ కాలేజీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
- టెక్ మహీంద్ర, హిటాచీ తదితర కంపెనీల్లోనూ జనరల్ మేనేజర్, హెచ్‌ఆర్ డైరెక్టర్ తదితర ఉన్నత హోదాల్లో పనిచేశారు.
- న్యాయవాదిగా కూడా శ్రవణ్ వ్యవహరిస్తున్నారు.