Site icon HashtagU Telugu

Goshamahal BRS Candidate : గోషామహల్ బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

Nand Kishore Goshamahal

Nand Kishore Goshamahal

గత కొద్దీ రోజులుగా గోషామహల్ బిఆర్ఎస్ అభ్యర్థి (Goshamahal BRS Candidate)ఫై ఉత్కంఠ నెలకొని ఉండగా..ఆ ఉత్కంఠకు తెరదించారు మంత్రి కేటీఆర్ (KTR). BRS అభ్యర్థిగా నంద కుమార్ బిలాల్‌ (Nanda Kishore Vyas Bilal)ను ప్రకటించారు. టికెట్ కోసం పోటీ పడ్డ అశిస్ కుమార్ యాదవ్‌ (Ashish Kumar Yadav)ను కేటీఆర్ బుజ్జగించారు. ఆశిష్ కుమార్ సమక్షంలో బిలాల్‌కు కేటీఆర్ బీ ఫామ్ అందజేశారు. ఆశిష్ తో కలిసి పని చేయాలని బిలాల్‌కు కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారు.

గోషామహల్‌ నియోజకవర్గం నుంచి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా బీజేపీ నేత ఎమ్మెల్యే రాజాసింగ్ విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున గెలిచిన ఏకైక అభ్యర్థి కూడా రాజాసింగే కావడం గమనార్హం. దీంతో ఈసారి ఎలాగైనా గోషామహల్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ భావించింది. సరైన నేతను బరిలో పెట్టాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు ఆలస్యం చేసింది. చివరకు నందకిషోర్ వ్యాస్‌ను ఖరారు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె ఈరోజు పాతబస్తీ నియోజకవర్గాల (Old City) అభ్యర్ధులకు మంత్రి కేటీఆర్ బీఫాంలు అందజేశారు.

యాకుత్ పుర – సామ సుందర్ రెడ్డి

కర్వార్ – అందెల క్రిష్ణయ్య

నాంపల్లి – ఆనంద్ గౌడ్.

చార్మినార్ – ఇబ్రహింలోడీ

చాంద్రాయన గుట్ట -సీతారాంరెడ్డి

మలక్ పేట – తీగల అజిత్ రెడ్డి

బహదూర్ పుర – అలీ బాక్రీకి బి ఫామ్ లు అందజేశారు. దీంతో మొత్తం 119 నియోజకవర్గాల అభ్యర్థులకు బిఫామ్ ల పంపిణీ పూర్తయింది.

Read Also : KTR: కాంగ్రెస్ స్కాములపై బీఆర్ఎస్ పుస్తకం, కేటీఆర్ చేతుల మీదుగా పుస్తకావిష్కరణ

Exit mobile version