Site icon HashtagU Telugu

Chakali Ailamma : కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు – సీఎం రేవంత్

Name Of Chakali Ailamma For

Name Of Chakali Ailamma For

Name of Chakali Ailamma for Kothi Women’s University – CM Revanth : కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి (Kothi Women’s University) చాకలి ఐలమ్మ (Chakali Ailamma) పేరు పెడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. ఐలమ్మ 39వ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని దొరలు, దేశ్‌ముఖ్‌లు, రజాకార్లను గడగడ లాడిరచిన ఐలమ్మ స్ఫూర్తితో ప్రజాపోరాటాలను కొనసాగించాలన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె పాత్ర మరవలేనిదని కొనియాడారు.

ఐలమ్మ మనుమరాలు (Chakali Ailamma Grand Daughter) మహిళా కమిషన్ సభ్యురాలిగా నియామకం

భూముల ఆక్రమణలు అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆమె స్ఫూర్తి అని తెలిపారు. ఐలమ్మ మనుమరాలు శ్వేత (Chakali Ailamma’s Granddaughter Swetha)ను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐలమ్మ కుటుంబ సభ్యులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలని తమ ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. చాకలి ఐలమ్మ స్పూర్తితో ఇందిరా గాంధీ భూ సంస్కరణలు తీసుకొచ్చామని , భూమి పేదవాడి ఆత్మగౌరవం..అందుకే ఇందిరమ్మ పేదలకు లక్షల ఎకరాలను పంచినట్లు పేర్కొన్నారు. ధరణి ముసుగులో కొందరు పేదల భూములను గుంజుకునే కుట్ర చేశారు. పేదల భూములను కాపాడేందుకే ఐలమ్మ స్పూర్తితో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఇక కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Read Also : Annapurna Studios Donation : తెలంగాణ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ విరాళం