Site icon HashtagU Telugu

Telangana Viral : కోడి కేసు..! తలలు పట్టుకున్న పోలీసులు.. కోడికి న్యాయం కావాలంటూ వృద్ధురాలి పోరాటం

Telangana Viral

Telangana Viral

Telangana Viral : నకిరేకల్ పోలీస్ స్టేషన్‌ ఎదుట ఓ వింత కేసు దాఖలై, పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని గొల్లగూడెంకు చెందిన వృద్ధురాలు గంగమ్మ తన పెంపుడు కోడి కోసం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించడమే కాక, న్యాయం జరిగేదాకా వదిలిపెట్టనని పట్టుబడింది. ఈ కేసు పోలీసుల్ని కొంత విస్మయానికి గురిచేసింది. ఎందుకంటే, ఇది సాధారణ గొడవ కాదని, న్యాయం కోరుతూ వచ్చిన ఓ వృద్ధురాలి కోడి వ్యవహారం..!

Cold Feet : మీ పాదాలు తరచూ చల్లగా ఉంటున్నాయా? ఇది సాధారణం కాదు!.. వైద్య నిపుణుల హెచ్చరిక

గంగమ్మ ఇంటి దగ్గర పెంచుతున్న కోడి ప్రతిరోజూ బయటకు వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేది. ఈ క్రమంలో గంగమ్మ ఇంటి పక్కనే ఉన్న రాకేష్ అనే వ్యక్తి గడ్డివాము దగ్గర ఆ కోడి గింజలు తినేదట. అయితే ఇది చూసిన రాకేష్ కోడిపై కోపంగా కర్రతో కొట్టేశాడు. దాంతో కోడి కాళ్లు విరిగిపోయాయి. దీన్ని చూసిన గంగమ్మ కన్నీళ్లు కార్చుతూ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.

“నా కోడిని నా కళ్లముందే కొట్టాడు.. నేను డబ్బులు వద్దంటున్నా.. న్యాయం కావాలి. రాకేష్‌కు శిక్ష పడాలి. నా కోడికి జరిగినట్లు ఇంకెవ్వరి కోడికి జరగకూడదు,” అంటూ పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చింది గంగమ్మ. పోలీసులు ఈ విషయాన్ని సాధారణ గొడవగా చూడగా, గంగమ్మ మాత్రం వదిలిపెట్టేలా కనిపించలేదు. ఎంత చెప్పినా వినకపోవడంతో, “ఇప్పటికి ఇంటికి వెళ్లి కోడికి వైద్యం చేయించుకోండి. మేమే ఊరికి వచ్చి పంచాయతీ చేస్తాం,” అంటూ ఆమెను శాంతింపజేశారు.

Vijay Deverakonda : ప్లాప్స్ పడేసరికి విజయదేవరకొండ సింపతి ట్రై చేస్తున్నాడా..?

కానీ ఈ విచిత్రమైన “కోడి కేసు”ను ఎలా పరిష్కరించాలి అన్న దానిపై పోలీసులే తలలు పట్టుకుంటున్నారు. రోజూ హత్యలు, దోపిడీలు, దొంగతనాల కేసులతో బిజీగా ఉండే ఖాకీలు.. ఇలా కోడి కోసం వచ్చిన ఫిర్యాదుతో ఓ విరామం లాంటి అనుభూతిని పొందినప్పటికీ, దీనికి పరిష్కారం ఎలా చూపాలన్న కంగారుతో ఉన్నారు.