Telangana BJP: హోటల్‌లో తెలంగాణ బీజేపీ నేతలతో నడ్డా సీక్రెట్ మీటింగ్

తెలంగాణ బీజేపీ నేతలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సీక్రెట్ మీటింగ్ జరిపారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న నడ్డా నిన్న ఆదివారం 11 రాష్ట్రాలకు చెందిన పార్టీ అధ్యక్ష, కార్యదర్శులతో సమావేశం జరిపారు.

Telangana BJP: తెలంగాణ బీజేపీ నేతలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సీక్రెట్ మీటింగ్ జరిపారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న నడ్డా నిన్న ఆదివారం 11 రాష్ట్రాలకు చెందిన పార్టీ అధ్యక్ష, కార్యదర్శులతో సమావేశం జరిపారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. భవిష్యత్తు కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి తెలంగాణ బీజేపీ నేతలతో హోటల్‌లో సీక్రెట్ గా మీట్ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ నేతలకు క్లాస్ పీకినట్టు తెలుస్తుంది. మాట్లాడేముందు అలోచించి మాట్లాడాలని, పార్టీకి నష్టం తెచ్చేలా ప్రవర్తించకూడదు అంటూ వార్నింగ్ ఇచ్చినట్టు ప్రాధమిక సమాచారం.

తెలంగాణాలో ఇటీవల బీజేపీ కొద్దిగా కుదుపులకు గురవడం తెలిసిందే. బండి సంజయ్ పార్టీ అధ్యక్ష పదవిని కోల్పోవడం, ఈటల రాజేందర్ వ్యవహారం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణ… ఇలాంటి అంశాలు రాష్ట్ర బీజేపీలో అలజడి రేపాయి. దీనికి తోడు కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించడం కూడా పార్టీలో గందరగోళం నెలకొంది. దీంతో వారం రోజులుగా తెలంగాణ బీజేపీలో అయోమయం నెలకొంది. పార్టీ కార్యకర్తలు సైతం ఆలోచనలో పడ్డారు. ఇదంతా చివరికి పార్టీపై ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో గత రాత్రి నడ్డా తెలంగాణ బీజేపీ కీలక నేతలతో సమావేశం అయ్యారు.

హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్ లో నడ్డా తెలంగాణ నేతలతో సమావేశమయ్యారు. వారితో వేర్వేరుగా సమావేశమై బహిరంగంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు సహకరించాలని కోరారు. ఇటీవలి రోజుల్లో కొంతమంది నాయకులు తమ అసంతృప్తి ప్రకటనలు నడ్డాను అసంతృప్తి గురి చేశాయి. ఈ మేరకు వారికి క్లాస్ తీసుకున్నారట. పార్టీ గీత దాటిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొంతమంది నేతలు చేస్తున్న కొన్ని ప్రకటనలు, మీడియా లీకులు పార్టీని ఇబ్బంది పెట్టాయని ఆయన పేర్కొన్నారు. కలిసికట్టుగా పని చేస్తూ క్రమశిక్షణతో వ్యవహరించాలని నడ్డా నేతలకు సూచించారు. ఒకరినొకరు టార్గెట్ చేసుకోవడం మానుకోవాలని దిశానిర్దేశం చేశారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని స్పష్టం చేశారు.

నడ్డాను కలిసిన వారిలో రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే, పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ డీ. అరవింద్‌, మాజీ ఎంపీలు జి. వివేక్‌, విజయశాంతి, కోమటిరెడ్డి ఉన్నారు.

Read More: Mother Runs Car Over Daughter : బిడ్డపై నుంచి కారు నడిపిన తల్లి.. పసికందు మృతి