Site icon HashtagU Telugu

Hyderabad: హైదరాబాద్‌లో నడ్డా అధ్యక్షతన బీజేపీ జాతీయ స్థాయి కీలక సమావేశం

Hyderabad

New Web Story Copy 2023 07 09t150414.956

Hyderabad: తెలంగాణ బీజేపీలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్ సారధ్యంలో బీజేపీ ఎన్నికలకు వెళుతుందని మొదటి నుంచి చెప్పుకొస్తున్న కేంద్రం అనూహ్యంగా మాట మార్చింది. తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ఐ తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ చీఫ్ గా మాజీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియమితులయ్యారు. దీంతో తెలంగాణ బీజేపీలో అయోమయం నెలకొంది. కానీ బీజేపీ పెద్దలు మాత్రం ఇదొక రాజకీయ ఎత్తుగడగా ప్రచారం చేసుకుంటున్నారు. విశేషం ఏంటంటే బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడంపై బండి సంజయ్ అసంతృప్తిగా ఉన్నట్టే, కేంద్ర పదవి నుంచి తొలగించడాన్ని కిషన్ రెడ్డి జీర్ణించుకోలేక పోతున్నారట. ఇదిలా ఉండగా ఈ రోజు హైదరాబాద్ లో బీజేపీ కీలక సమావేశం జరిగింది

వచ్చే ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసేందుకు కేంద్రం అడుగులు వేస్తుంది. అందులో భాగంగా సంస్థాగత అంశాలపై చర్చించేందుకు ఆదివారం హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ స్థాయి కీలక సమావేశం జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి 11 రాష్ట్రాలకు చెందిన రాష్ట్ర అధ్యక్షులు హాజరయ్యారు. 11 రాష్ట్రాలకు చెందిన పార్టీ సంస్థాగత కార్యదర్శులు, ఇన్‌ఛార్జ్‌లు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా నియమితులైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఉన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఇతర సీనియర్ నేతలు కీలక సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ , కేంద్ర మాజీ మంత్రి డి.పురందేశ్వరి కూడా హాజరయ్యారు.

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బేగంపేట విమానాశ్రయంలో జేపీ నడ్డా స్వాగతం పలికారు. రాష్ట్ర భాజపా మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ కె.లక్ష్మణ్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తదితర నేతలు పాల్గొన్నారు.

Read More: Hyderabad Fire: సికింద్రాబాద్ బట్టల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం