Gangavva : కవిత ను కలిసిన గంగవ్వ

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత… ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

  • Written By:
  • Updated On - November 29, 2021 / 10:32 AM IST

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత… ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా… ఎన్నికల్లో టీఆర్ఎస్ మినహా కాంగ్రెస్ అలాగే బిజెపి పార్టీలు పోటీ చేయకపోవడంతో కల్వకుంట్ల కవిత ఎన్నిక వర్గం అయింది. స్వతంత్ర అభ్యర్థి పోటీ చేసినప్పటికీ సరైన.. పత్రాలు సమర్పించక పోవడంతో అతడి ఎన్నికను రద్దు చేసింది ఎన్నికల సంఘం.

అయితే ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం ఇవాళ కొండగట్టు అంజన్న నువ్వు దర్శించుకున్నారు కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా కొండగట్టు అంజన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అయితే ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను… బిగ్ బాస్ ఫేం, మై విలేజ్ షో సెలబ్రిటీ గంగవ్వ కలిశారు.

మర్యాదపూర్వకంగా కలిసిన గంగవ్వ టీం…. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితను సత్కరించారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… అధికార టీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని… టిఆర్ఎస్ పార్టీ ముందు ఇంకా అనేక టార్గెట్స్ ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా తాము పని చేస్తున్నట్లు స్పష్టం చేశారు కల్వకుంట్ల కవిత.