తెలంగాణ శాసనసభలో మున్సిపల్ చట్ట సవరణ బిల్లు – 2025ను (Municipal Act Amendment Bill 2025) ఏకగ్రీవంగా ఆమోదించడం రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా చట్టపరంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ బిల్లుతో బీసీలకు గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు మార్గం సుగమం కానుంది. ఇప్పటి వరకు ఉన్న 50 శాతం రిజర్వేషన్ పరిమితి కారణంగా బీసీలు అన్యాయం ఎదుర్కొన్నారని ప్రభుత్వం వాదిస్తోంది. అందువల్ల 2018 పంచాయతీరాజ్ చట్టంలోని 285A సెక్షన్‌ను సవరించి ఈ అవరోధాన్ని తొలగించాలని నిర్ణయం తీసుకుంది.
TG Assembly Session : కల్వకుంట్ల కుటుంబం అంటే కలవకుండా చూసే కుటుంబం- CM రేవంత్
మంత్రి సీతక్క సభలో బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడుతూ, బీసీల జనాభా ప్రాతిపదికన వారికి తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదని పేర్కొన్నారు. ఇందుకోసం ఇంటింటి సర్వే, కులగణన, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి సంబంధిత అధ్యయనం చేపట్టినట్లు తెలిపారు. డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ బిల్లును సిద్ధం చేసిందని వెల్లడించారు. ఈ నివేదికలో బీసీలు వెనుకబడిన పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వారికి 42 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందిగా సిఫార్సు చేయబడింది.
ప్రస్తుతం బిల్లు రాష్ట్రపతి ఆమోదానికి పంపబడింది. గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే బీసీలకు స్థానిక సంస్థల్లో పెరిగిన రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. అయితే, సుప్రీంకోర్టు 50 శాతం రిజర్వేషన్ పరిమితిని విధించిన తీర్పు నేపథ్యంలో ఈ సవరణకు చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది. అయినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం బీసీలకు తగిన న్యాయం జరిగేలా ఈ బిల్లును ముందుకు తీసుకువెళ్తుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం బీసీలకు ప్రాతినిధ్యం పెరగడమే కాకుండా, గ్రామీణ మరియు పట్టణ స్థాయిలో వారి సామాజిక, రాజకీయ శక్తిని బలపరుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.