తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ములుగు ఎమ్మెల్యే , కాంగ్రెస్ అభయార్ది సీతక్క (Mulugu Seethakka) విస్తృతంగా ప్రచారం చేస్తూ..మరోసారి విజయాన్ని అందించాలని ఓటర్లను కోరుతుంది. రాష్ట్రంలో ఎన్నికల వేడి గట్టిగా నడుస్తుంది. అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) , కాంగ్రెస్ (Congress) పార్టీలు ఇరువురు నువ్వా నేనా అనే రేంజ్ లో పోటాపోటీగా ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నాయి. ఈసారి కాంగ్రెస్ కే ప్రజలు పట్టం కట్టబోతున్నారని పలు సర్వేలు చెపుతుండడడం తో కాంగ్రెస్ అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత దూకుడు పెంచుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ములుగు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్న సీతక్క..తనను మళ్లీ గెలిపిస్తే మంత్రిగా మీకు మరింత సేవ చేస్తానని ప్రజలకు చెపుతూ వస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయం సాధించి, అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ములుగుకు ఎంతమంది వచ్చి ప్రచారం చేసినా.. ఎన్ని కోట్లు ఖర్చు చేసినా చివరకు గెలిచేది నేనే అని..నా గెలుపును ఎవరూ ఆపలేరని సీతక్క ధీమా వ్యక్తం చేసింది.
ఇక సీతక్క మొదటిసారి 2009లో టిడిపి పార్టీ తరఫున ములుగు నియోజకవర్గం నుంచి బరిలోకి నిలిచి విజయం సాధించారు. 2014లోనూ మరోసారి టీడీపీ నుంచి పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన సీతక్క 2018లో అదే నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచారు. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు చూస్తుంది. కాంగ్రెస్ నుంచి సీతక్క బరిలో నిల్చుంటే.. బీఆర్ఎస్ నుంచి బడే నాగజ్యోతి, బీజేపీ నుంచి అజ్మీరా ప్రహ్లాద్ నాయక్ పోటీలో ఉన్నారు. మరి ఈ ముగ్గురిలో ప్రజలు ఎవరికీ పట్టం కడతారనేది చూడాలి.
Read Also : Serilingampally: శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ గెలుపు ఖాయం: కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్