SI Suicide : సర్వీస్ రివాల్వర్‌‌తో కాల్చుకొని ఎస్సై సూసైడ్

ఆయన వాజేడు  మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్‌లో ఎస్సైగా(SI Suicide) పనిచేస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Si Suicide With Service Revolver Mulugu District

SI Suicide : ములుగు జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఎస్సై‌ రుద్రారపు హరీశ్  సర్వీస్ రివాల్వర్‌‌తో కాల్చుకొని సూసైడ్ చేసుకున్నారు. ఆయన వాజేడు  మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్‌లో ఎస్సైగా(SI Suicide) పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏటూరు నాగారం మండల పరిధిలోని ముళ్లకట్ట బ్రిడ్జి సమీపంలో ఉన్న ఓ రిసార్ట్‌లో హరీశ్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఎందుకు సూసైడ్ చేసుకున్నారు ? కారణాలు ఏమిటి ? ఆ రిసార్టుకు ఎందుకు వెళ్లారు ? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ అంశాలపై ప్రస్తుతం పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ సూసైడ్ వెనుక ఏవైనా వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అనే కోణంలోనూ వివరాలను రాబడుతున్నారు.

Also Read :Football Match Clashes : ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ రక్తసిక్తం.. రెఫరీ నిర్ణయంపై ఫ్యాన్స్ ఘర్షణ.. 100 మంది మృతి

పూసూరు గోదావరి బ్రిడ్జి సమీపంలో ఉన్న ఫెరిడో రిసార్ట్‌లో ఎస్సై‌ రుద్రారపు హరీశ్ సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది. దీనిపై ఫెరిడో రిసార్ట్ సిబ్బంది వెంటనే వాజేడు పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. ఎస్సై‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏటూరునాగారం పరిధిలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్ జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఎస్ఐ అనుమానాస్పద స్థితిలో సూసైడ్ చేసుకోవడం పలు సందేహాలకు తావిస్తోంది.

Also Read :Silk Smitha : ‘సిల్క్ స్మిత’పై మరో బయోపిక్.. ఈసారి సిల్క్ పాత్రలో చేసేది ఎవరో తెలుసా?

ఈ కారణం వల్లే ?

ఎస్సై హరీ‌శ్‌కు వరంగల్ నగరానికి చెందిన అమ్మాయితో పెళ్లి కుదిరింది. మరో వారం రోజుల్లో ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ జరగనుంది. అయితే తనకు వరుసకు మేనకోడలు అయ్యే అమ్మాయితో హరీష్ ప్రేమలో ఉన్నాడని తెలిసింది. పెళ్ళి విషయంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఫోనులో వాగ్వాదం జరిగిందని అంటున్నారు. సోమవారం ఉదయం డ్యూటీకి వెళ్లేందుకు సిద్ధమై ఆరుగంటలకు పోలీసు స్టేషను డ్రైవరుకు హరీశ్ కాల్ కూడా చేశారట. ఇంతలోనే ఆయన సూసైడ్ చేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. హరీష్ మెడకు చున్నీ చుట్టి ఉండటం గమనార్హం.

  Last Updated: 02 Dec 2024, 08:02 PM IST