Mrigasira Karthi : చేపలకు ఫుల్ డిమాండ్

మృగశిర కార్తె మొదటి రోజు చేపలు తినే ఆచారం మన పూర్వీకుల నుంచి అనాదిగా వస్తోంది

  • Written By:
  • Publish Date - June 7, 2024 / 12:19 PM IST

ఈరోజు మృగశిర కార్తె (Mrigasira Karthi) సందర్బంగా అన్ని చోట్ల చేపలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మృగశిర కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యం సిద్దిస్తుందని చాలామంది నమ్ముతారు. మృగశిర కార్తె మొదటి రోజు చేపలు తినే ఆచారం మన పూర్వీకుల నుంచి అనాదిగా వస్తోంది. మృగశిర కార్తె ఆరంభంలో వచ్చే వాతావరణ మార్పుల కారణంగా శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయి వ్యాధులు సంక్రమించవచ్చు. ఇలాంటి వ్యాధుల నుంచి గట్టెక్కాలంటే చేపలు తినాల్సిందే! దీని వల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో చేపలను ఇంగువలో, చింత చిరుగులో పెట్టుకుని తింటారు. మృగశిరకార్తె రోజున ఏ ఇంట చూసినా చేపల పులుసే. చేపల కూర వంటకాలే కనిపిస్తుంటాయి. దీంతో ఈరోజు పెద్ద ఎత్తున చేపలను కొనుగోలు చేస్తారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ డిమాండ్‌ నేపథ్యంలో వ్యాపారులు పెద్దఎత్తున చేపలను దిగుమతి చేస్తారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు గ్రామాల్లో చెరువుల వద్ద గ్రామస్థులు చేపలు కొనేందుకు క్యూ కట్టారు. అందేవిధంగా పట్టణాల్లో మార్కెట్లు అన్ని కిటకిటలాడుతున్నాయి. ఇక హైదరాబాద్‌లోని ముషీరాబాద్, రాంనగర్ చేపల మార్కెట్లలో మృగశిరకార్తె సందర్భంగా పలు ప్రాంతాల నుంచి చేపలు పెద్ద ఎత్తున దిగుమతి అయ్యాయి. మామూలు రోజుల్లో 15 టన్నుల నుంచి 20 టన్నుల చేపల విక్రయాలు జరుగతుండగా మృగశిర కార్తె సందర్భంగా రెండు తెలుగు రాష్ర్టాల నుంచి 50 టన్నుల నుంచి 70 టన్నుల చేపలు సేల్ అవుతాయని వ్యాపారులు తెలిపారు. రాష్ట్రంలో చేపల ఉత్పత్తి అధికం కావడంతో వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, నల్గొండ, చేవెళ్ల జిల్లాలతోపాటు ఏపీలోని కైకలూరు, తెనాలి, ఆకువీడు ప్రాంతాల నుంచి చేపలను దిగుమతి చేసుకున్నట్లు ముషీరాబాద్‌ వ్యాపారి పూసగోరక్‌నాథ్‌ తెలిపారు.

Read Also : OG Movie : భారీ ధరకు అమ్ముడుపోయిన పవన్ ‘ఓజి’ మూవీ ఓటీటీ రైట్స్‌.. ఎంతంటే..?