Site icon HashtagU Telugu

MP Santosh : వినూత్నంగా ‘హ్యాపీ సండే’ చెప్పిన ఎంపీ సంతోష్.. ఫొటోలు వైరల్

Sunbird Mp Santosh

Sunbird Mp Santosh

MP Santosh : పర్యావరణ పరిరక్షణపై  బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్‌ ఎంతగా ఆసక్తి  చూపుతుంటారో తెలంగాణ ప్రజలందరికీ బాగా తెలుసు. మొక్కలను నాటేలా ప్రజలను ప్రోత్సహించేందుకు ఆయన చేపట్టిన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు యావత్ దేశానికి సుపరిచితం. తాజాగా ఆదివారం రోజు ఆయన తన ఫొటోగ్రఫీ స్కిల్‌ను అందరికీ చూపించి మరోసారి భళా అనిపించారు. తన కెమెరాతో సన్ బర్డ్, పర్పుల్ సన్ బర్డ్, ఇండియన్ వైట్ ఐ బర్డ్, పాలస్తీనా సన్ బర్డ్‌లను చూడచక్కగా జోగినపల్లి సంతోష్ కుమార్‌ క్లిక్ మనిపించారు. ఆ ఫొటోలు అబ్బురపరిచేలా ఉన్నాయి. ఆ నాలుగు రకాల అరుదైన పక్షుల ఫొటోలు ఎంతో అందంగా ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join

ఈ ఫొటోలను ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పోస్ట్ చేస్తూ  జోగినపల్లి సంతోష్  (MP Santosh) చక్కటి టెక్ట్స్ కూడా రాసుకొచ్చారు.  ‘‘నేను ఎప్పుడైనా కొన్ని పక్షులను చూడటం మిస్సవుతానేమో.. ఒకవేళ చూస్తే మాత్రం క్షణం కూడా ఆలస్యం చేయకుండా వాటిని కెమెరాలో ఒడిసి పట్టేస్తాను. నా ఫొటోగ్రఫీ అంత ఫాస్ట్‌గా పాదరసంలా ఉంటుంది. ప్రతీ వీకెండ్‌లో ప్రకృతి అందాలను కెమెరాలో బంధించి వీక్షకుల ముందుకు తెచ్చే నా అలవాటులో భాగమే ఈ ఫొటోలన్నీ.. అందరూ చూసి ఆనందించండి.. హ్యాపీ సండే.. మీకు ఈ సండే ఆనందాలు, సంతోషాలతో నిండిపోవాలని కోరుకుంటున్నా’’ అని జోగినపల్లి సంతోష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రతీ వీకెండ్‌‌లో ఓ వైపు పర్యావరణ పరిరక్షణ గురించి నెటిజన్లకు తెలియజేస్తూ..  మరోవైపు ప్రకృతి అందాలను చక్కగా చూపిస్తూ సామాజిక బాధ్యతతో ముందుకుసాగుతున్న సంతోష్‌పై అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Also Read : AP DSC : గందరగోళంలో డీఎస్సీ అభ్యర్థులు.. ‘టెట్‌ హాల్‌టికెట్‌’ నంబర్ల ఎంట్రీపై ప్రశ్నలు