KTR : కేటీఆర్ ఇప్పుడెందుకీ సన్నాయి నొక్కులు..? – ఎంపీ రఘునందన్

గతంలో జన్వాడ ఫామ్ హౌస్ ఫై డ్రోన్లు ఎగరవేశారని రేవంత్ రెడ్డి ఫై కేసులు పెట్టారు. మరి ఫామ్ హౌస్ నీది కాదని అప్పుడే ఎందుకు చెప్పలేదు కేటీఆర్

Published By: HashtagU Telugu Desk
Mp Raghunandan Rao React On

Mp Raghunandan Rao React On

తన పేరుపై ఏ ఫామ్ హౌస్ (Farm House) లేదని కేటీఆర్ (KTR) స్పష్టం చేయడం ఫై కాంగ్రెస్ , బిజెపి నేతలు విమర్శలు చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా కట్టిన కట్టడాలను కూల్చేస్తు వస్తుంది. ఈ క్రమంలో కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా కూల్చేస్తారనే వార్తలు ఉపంచుకున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 111 జీవోను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టిన జన్వాడ ఫామ్ హౌస్ ను సైతం కూల్చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా ఫామ్ హౌస్ పై అందిన ఫిర్యాదులపై ఆయా ఫామ్ హౌస్ నిర్మాణాల కోసం ఏ ఏ శాఖల నుంచి అనుమతులు ఇచ్చారనే కోణంలో హైడ్రా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మీడియా లో అనేక కథనాలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో కేటీఆర్ రియాక్ట్ అయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

బ‌ఫ‌ర్ జోన్‌లోని కానీ, ఎఫ్‌టీఎల్‌లో కానీ త‌న‌కంటూ ఎలాంటి ఫామ్‌ హౌజ్ లేదని.. మీరు చెప్తున్న ఆ ఫామ్ హౌజ్ త‌న స్నేహితుడిది అని కేటీఆర్ స్పష్టం చేసారు.త‌న స్నేహితుడి ఫామ్ హౌజ్ ఎఫ్‌టీఎల్ లేదా బఫర్ జోన్‌లో ఉంటే నేనే దగ్గర్నుండి కూలగొట్టిస్తా. నో ప్రాబ్లం.. మంచి జ‌రుగుతున్న‌ప్పుడు అంద‌రం ఆహ్వానించాల్సిందే..అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. దీనిపై BJP ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) స్పందించారు. ‘గతంలో జన్వాడ ఫామ్ హౌస్ ఫై డ్రోన్లు ఎగరవేశారని రేవంత్ రెడ్డి ఫై కేసులు పెట్టారు. మరి ఫామ్ హౌస్ నీది కాదని అప్పుడే ఎందుకు చెప్పలేదు కేటీఆర్. ఇప్పుడెందుకీ సన్నాయి నొక్కులు?’ అని రఘునందన్ ప్రశ్నించారు.

Read Also : Atchutapuram : రియాక్టర్ పేలుడు.. 6 కు చేరిన మృతుల సంఖ్య

  Last Updated: 21 Aug 2024, 07:25 PM IST