Praja Palana : ప్రజాపాలన దరఖాస్తులపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ సీఎం (Telangana CM) గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి (Revanth Reddy)..పాలనలో తనదైన మార్క్ కనపరుస్తూ..ప్రజా క్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న రేవంత్.. ‘ప్రజాపాలన’ (Praja Palana) పేరుతో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసందే. రేపటి ( డిసెంబర్ 28 ) నుండి ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఈ ప్రజాపాలనలో భాగంగా.. గ్రామా సభలు ఏర్పాటు చేసి , ఆరు గ్యారెంటీలకు సంబదించిన దరఖాస్తులను […]

Published By: HashtagU Telugu Desk
Mp Asaduddin Owaisi

Mp Asaduddin Owaisi

తెలంగాణ సీఎం (Telangana CM) గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి (Revanth Reddy)..పాలనలో తనదైన మార్క్ కనపరుస్తూ..ప్రజా క్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న రేవంత్.. ‘ప్రజాపాలన’ (Praja Palana) పేరుతో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసందే. రేపటి ( డిసెంబర్ 28 ) నుండి ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఈ ప్రజాపాలనలో భాగంగా.. గ్రామా సభలు ఏర్పాటు చేసి , ఆరు గ్యారెంటీలకు సంబదించిన దరఖాస్తులను ప్రజల నుండి తీసుకోబోతుంది. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా ఈ ప్రజాపాలనపై ఎమ్ఐఎమ్ పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా పాలన ద్వారా స్వీకరించే దరఖాస్తులు ఉర్దూలోనూ ఉండాలని డిమాండ్ చేశారు. వెంటనే ఉర్దూ భాషలోనూ అందుబాటులోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీఎస్‌ను కోరారు. అందరూ అవకాశాన్ని ఉపయోగించుకొని లబ్ధిపొందాలని ఆకాంక్షించారు. మరి ఒవైసీ సూచనను ప్రభుత్వం పాటిస్తుందో లేదో చూడాలి.

Read Also : Amrit Bharat Express : పట్టాలెక్కేందుకు సిద్దమైన అమృత్ భారత్ రైలు..దీని ప్రత్యేకతలు తెలుసా..?

  Last Updated: 27 Dec 2023, 10:41 AM IST