Maoist Hidma : రూ.50 లక్షల రివార్డు కలిగిన మావోయిస్టు కీలక నేత హిడ్మా తెెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం సమీపంలోని కర్రెగుట్టల్లోకి ప్రవేశించాడనే టాక్ వినిపిస్తోంది. అతడు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు కావడంతో వెంటనే తెలంగాణలోని నిఘా విభాగాలకు సమాచారం చేరింది. దీంతో కర్రెగుట్టల్లోకి భద్రతా బలగాలు ప్రవేశించాయి. మొత్తం అడవిలో సోమవారం రాత్రి నుంచి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అడవుల్లో దాదాపు 1000 మంది సాయుధ పోలీసులు కూంబింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలో సాయుధ బలగాలను భారీగా మోహరించారు. దీంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కర్రెగుట్టల విషయానికొస్తే.. అవి ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్నాయి. బచావో కర్రెగుట్టలు పేరుతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కర్రెగుట్టల వైపు ఆదివాసీలు రావొద్దంటూ మావోయిస్టులు(Maoist Hidma) కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
ఈ గ్రామాల్లో ఉద్రిక్తత
కర్రెగుట్టకు సమీపంలోని పెనుగోలు, కొంగాల, అరుణాచల పురం, బొల్లారం గ్రామాలు.. వెంకటాపురం మండలంలోని సరిహద్దు గ్రామాలు, పెంక వాగు, మల్లాపురం, కర్రెవానిగుప్ప, లక్ష్మీపురం, ముత్తారం, పెంకవాగు కలిపాక, సీతారాంపురం.. కర్రెగుట్ట పైన ఉన్న పామనూరు, ముకునూరు, చెలిమెల, తడపల , జెల్ల గ్రామాల్లో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Also Read :New Pope Race: కొత్త పోప్ ఎన్నిక.. రేసులో నలుగురు భారతీయులు
హిడ్మా గురించి..
- ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో పుట్టిన హిడ్మా 17ఏళ్ల వయసులోనే మావోయిస్టులలో చేరాడు.
- 2011 సంవత్సరంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో జరిగిన చింతల్నార్ దాడిలో దాదాపు 75 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు చనిపోయారు. ఈ దాడికి హిడ్మా నాయకత్వం వహించాడు.
- 2017లో జరిగిన బూర్కపాల్ దాడిలోనూ హిడ్మా పాత్ర ఉంది.
- ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో గత రెండు దశాబ్దాల్లో జరిగిన ప్రధాన హింసాకాండలకు హిడ్మాయే కారణం.
- మావోయిస్టు పార్టీలో ఉన్న నంబర్ 1 బెటాలియన్ ప్రస్తుతం హిడ్మా పరిధిలో ఉందని అంటారు. హిడ్మా ఆదేశాలిస్తే ఈ బెటాలియన్ ఎక్కడైనా విరుచుకుపడుతుంది. మావోయిస్టు పార్టీకి చెందిన అత్యంత భయంకరమైన బెటాలియన్‌గా సుక్మా జిల్లా టీమ్‌కు పేరుంది.
- భద్రతా బలగాలు డ్రోన్లు, హెలికాప్టర్లతో చుట్టుముడుతున్న ప్రస్తుత తరుణంలో.. మావోయిస్టుల పోరాటం ఇంకా ఎక్కువ కాలం పాటు కొనసాగే ఛాన్స్ లేేదు.
- మావోయిస్టులలో కోవర్టులు బాగా పెరిగిపోయాయి. వారు ఇచ్చే సమాచారమే భద్రతా బలగాలకు కీలకమైన అస్త్రంగా మారుతోంది.