10 BRS Leaders : బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నేతలు టార్గెట్‌గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరిన్ని విషయాలు వెలుగుచూశాయి. బీఆర్‌ఎస్‌కు చెందిన 10 మందికిపైగా నేతలు(10 BRS Leaders) ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారని వెల్లడైంది. ఈవిషయాన్ని పోలీసుల దర్యాప్తులో టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ(ఎస్డీ) రాధాకిషన్‌రావు చెప్పారు. వచ్చేవారం ఆ బీఆర్ఎస్ నేతలపై పోలీసుల దర్యాప్తు టీమ్ ఫోకస్ చేయనుందట. ఇవాళ (బుధవారం) రాధాకిషన్‌రావు కస్టడీ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో విచారణ సారాంశానికి సంబంధించి పేపర్‌వర్క్ పూర్తయ్యాక.. బీఆర్ఎస్ నేతలకు నోటీసులు జారీ చేసి, వారిని కూడా ప్రశ్నించే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ కేసు వచ్చేవారం కొత్త మలుపు తిరగనుంది. కాగా, నాంపల్లి కోర్టు అనుమతితో రాధాకిషన్‌రావును పంజాగుట్ట పోలీసులు ఏడు రోజుల కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే.
We’re now on WhatsApp. Click to Join
ఓ దశలో రాధాకిషన్‌రావు నోరు మెదపకపోవడం.. సమాధానాలను దాటవేసే యత్నం చేయడంతో.. అధికారులు తమదైన శైలిలో ఆయనను విచారించినట్లు తెలుస్తోంది. దాంతో రాధాకిషన్‌రావు మొత్తం చిట్టాను విప్పినట్లు సమాచారం. 2017లో టాస్క్‌ఫోర్స్ డీసీపీగా పోస్టింగ్ పొందడం దగ్గరి నుంచి 2020 ఆగస్టులోనే రిటైరైనా మరో మూడేళ్లు అదనంగా కొనసాగడం దాకా ప్రతీ వ్యవహారాన్ని రాధాకిషన్‌రావు పూస గుచ్చినట్టుగా వివరించారని అంటున్నారు. ఈవిధంగా కెరీర్‌లో తనకు సహకరించిన బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలకు ఏవిధంగా సహకరించాననే వివరాలను ఆయన పోలీసులకు తెలియజేశారు.
Also Read :Peter Higgs : దైవకణం కనుగొన్న శాస్త్రవేత్త ఇక లేరు.. ఏమైందంటే..
200 ప్రశ్నలు.. ఏమిటో తెలుసా ?
- రాధాకిషన్‌రావును పంజాగుట్ట పోలీసులు ఏడు రోజుల కస్టడీకి తీసుకోగా.. మొదటి రెండు రోజులు వ్యక్తిగత జీవితం, సర్వీస్ గురించి ప్రశ్నలు అడిగారు. దీంతోపాటు ఎస్‌ఐబీలో ప్రత్యేక టీంలలో ఎవరెవరు పనిచేసేవారు? ఫోన్‌ట్యాపింగ్ టీమ్ ఎవరితో కలిసి పనిచేసేది? ఎస్‌ఐబీలో ఉన్న సిబ్బంది/అధికారుల పాత్ర ఏమిటి? టాస్క్‌ఫోర్స్ రోల్ ఏంటి? అనే అంశాలపై ఇంటరాగేట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ సమాచారం ఆధారంగా జరిగిన బెదిరింపులు, నగదు తరలింపు, బెదిరింపు వసూళ్లపైనా రాధాకిషన్‌రావును అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది.
- ఇక మూడో రోజు నుంచి ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించిన బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలెవరు? వారి పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలను అడిగారని సమాచారం.
- కోర్టులో ఈ కేసు వీగిపోకుండా ఉండేలా బలమైన ఆధారాలను సేకరించేందుకు.. ఫోన్ ట్యాపింగ్ రాజకీయ కోణానికి సంబంధించిన 200 ప్రశ్నలను పోలీసులు రెడీ చేసుకున్నారు. వాటినే కీలక నిందితులుగా ఉన్న మాజీ పోలీసు అధికారులను అడుగుతున్నారు.