Site icon HashtagU Telugu

Money Doubling : 200 రోజుల్లో డబ్బులు డబుల్.. చీటింగ్ స్కీమ్‌తో కుచ్చుటోపీ !

Ransomware Attack

Money Doubling : ‘‘మా వెబ్‌సైట్‌లో రూ.5వేలు, రూ.10వేలు, రూ.లక్ష పెట్టుబడి పెడితే 200 రోజుల్లో డబ్బులు డబుల్ అవుతాయి. గడిచిన ఆరు నెలల్లో రూ.8 కోట్ల టర్నోవర్‌ చేశాం. మీరు కూడా చేరండి’’ అంటూ ఓ వ్యక్తి ఎంతోమందిని బురిడీ కొట్టించాడు. కొందరు ప్రజల దురాశను ఆసరాగా చేసుకునే ఈ ట్రిక్‌తో తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాలతో పాటు ఏపీలోని జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్ల, విజయవాడ ప్రాంతాల నుంచి దాదాపు రూ.10కోట్ల డిపాజిట్లు సేకరించారని తెలుస్తోంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో తరుచూ కార్యాలయాలను మార్చారు.. కానీ వెబ్‌సైట్‌లో మాత్రం బెంగళూరుకు చెందిన ఒకే అడ్రస్(Money Doubling) మెయింటైన్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపురంతండాకు చెందిన వ్యక్తి ఓ ఆన్‌లైన్‌ స్టోర్‌ను ప్రారంభించాడు. గతేడాది జూన్‌లో ఓ వెబ్‌సైట్‌‌ను ఏర్పాటుచేసి.. డబ్బులు డబుల్ అయ్యే ప్రకటనలు ఇవ్వడం మొదలుపెట్టాడు. నేలకొండపల్లికి చెందిన ఓ హోటల్‌ నిర్వాహకుడు, మరో ఐదుగురి సహాయంతో ఈ చీటింగ్ స్కీంపై ప్రచారం చేశాడు. మొదట్లో పెట్టుబడి పెట్టిన వారి అకౌంట్లలో రెట్టింపు అమౌంట్ వేశారు. వారితో రికమెండేషన్ చేయించుకొని.. ఇతరులతోనూ డబ్బులు డిపాజిట్ చేయించుకోవడం మొదలుపెట్టారు. లబ్ధి పొందిన అతికొద్దిమంది కార్లు కొనడం, టూర్లు తిరగడం కూడా జరిగింది. దీనిపై సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య ఇంకా పెరిగింది. చివరకు ప్రజలు డిపాజిట్ చేసిన డబ్బుపై.. రోజూ కొంత కమిషన్‌ను ‘నేటి లాభం’ పేరుతో వాలెట్‌లో జమ చేశారే తప్ప, డబ్బులు డబుల్‌గా ఇవ్వలేదు. అందరికీ కుచ్చుటోపీ పెట్టారు. 2023 జూన్ నుంచి ఇప్పటివరకు 620 మంది ఈ స్కీంలో చేరారని సమాచారం. దీనిపై పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: Bhogipallu : భోగిరోజున పిల్లలకు భోగిపళ్లు ఎందుకు పోస్తారు ?

సైబర్ నేరగాళ్లు ప్రజల నుంచి డబ్బులు కొట్టేయడానికి ఏ అవకాశాన్నీ వదులుకోరు. ప్రజలకు ఆసక్తిని కలిగించే ఏ అంశం అయినా దోచుకోవడానికి మార్గంగా ఎంచుకుంటారు. గత కొన్నిరోజులుగా దేశంలో అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠపై చర్చ సాగుతోంది. కోట్లాదిమంది హిందువులు రామాలయ ప్రారంభోత్సవం కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. సైబర్ నేరగాళ్ళు చివరకు రామమందిర ప్రారంభోత్సవ ఈవెంట్‌ను కూడా వదలలేదు. ఈ నెల 22వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా రామమందిరం ప్రారంభం కానుంది.దీంతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరతీశారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి వీఐపీ టిక్కెట్ల పేరుతో వాట్సాప్‌కు ఏపీకే ఫైల్‌ను పంపిస్తున్నారు. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే.. దీనిపై క్లిక్ చేస్తే మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు చోరీకి గురయ్యే అవకాశముంది.