Site icon HashtagU Telugu

Mohammed Siraj : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మహమ్మద్ సిరాజ్

Mohammed Siraj meet Chief Minister Revanth Reddy

Mohammed Siraj meet Chief Minister Revanth Reddy

Mohammed Siraj: టీం ఇండియా క్రికెటర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయను కలిశారు. ఈ సందర్భంగా టీ 20 ప్రపంచ కప్‌ సాధించినందుకు సిరాజ్‌ను సీఎం రెవంత్‌ రెడ్డి అభినందించారు. అనంతరం టీం ఇండియా జెర్సీ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మహమ్మద్‌ సిరాజ్‌ బహుకరించారు. ఈ కార్యక్రమంలో… ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు మంత్రి కోమటి రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ గా మారాయి.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, టీ 20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత.. టీం ఇండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ మొన్న హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా టీం ఇండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌కు గ్రాండ్‌ వెల్‌ కం లభించిన విషయం తెలిసిందే. మెహిదీపట్నం నుండి ఈద్‌గహ్‌ గ్రౌండ్‌లోని సిరాజ్‌ ఇంటి వరకు అభిమానులు ర్యాలీ తీశారు.

Read Also:Prabhas Spirit : స్పిరిట్ కోసం కొరియన్ స్టార్.. సందీప్ ప్లానింగ్ వేరే లెవెల్..!