Site icon HashtagU Telugu

Modi’s Guarantee : నారాయణపేటలో ‘మోడీ గ్యారెంటీ’ల ప్రకటన..

Modi Wgl

Modi Wgl

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నారాయణపేటలో ఏర్పటు చేసిన బిజెపి సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణను భారీ మెజార్టీ తో గెలిపించాలని ప్రజలను కోరుతూ ..కాంగ్రెస్ పార్టీ ఫై నిప్పులు చెరిగారు. గత పదేళ్లలో తెలంగాణకు రూ.లక్షల కోట్లు ఇచ్చామని..తాము ఇచ్చిన నిధులు అవినీతి ఏటీఎంలోకి వెళ్లాయని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుందని, ఇప్పుడు కాంగ్రెస్‌ దోచుకుంటోందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరిట లూటీ చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా బీఆర్ఎస్ దారిలోనే లూటీ చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక RRట్యాక్స్‌ వసూలు చేస్తోందని ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణ లో కాంగ్రెస్ అబద్దపు హామీలు ప్రకటించి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని మోడీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని కులాల పేరిట, మతాల పేరిట విభజించాలని చూస్తోందని , దేశం ఏమైపోయినా కాంగ్రెస్‌కు అవసరం లేదని, దానికి రాజకీయ లబ్ధి మాత్రమే కావాలని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ ఎన్నికలొస్తేనే తన ప్రేమ దుకాణం తెరుస్తారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు హిందువులపైగానీ, దేశంపైగానీ ప్రేమ లేదని, వంచితుల కోసం మోడీ చౌకీదార్‌లా ఉంటారన్నారు. మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణను గెలిపించాలని.. ఆమెకు వేసే ప్రతి ఓటు తనకే చెందుతుందన్నారు. డీకే అరుణపై స్వయంగా ముఖ్యమంత్రే దారుణ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక మోడీ గ్యారంటీ అంటే అభివృద్ధికి గ్యారంటీ, మోడీ గ్యారంటీ అంటే దేశ భద్రతకు గ్యారంటీ అని, మోడీ గ్యారంటీ అంటే విశ్వవేదికపై భారత గౌరవానికి గ్యారంటీ, మోడీ గ్యారంటీ అంటే ఇచ్చిన హామీలు నెరవేరతాయనే గ్యారంటీ అని స్పష్టం చేశారు.

Read Also : Liquor Policy Case: ఢిల్లీ మద్యం కేసులో కవితను నిందితురాలిగా చేర్చిన ఈడీ