Modi Tour: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఢిల్లీ పెద్దలు తరచుగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ ఇటీవలనే భారీ బహిరంగ సభకు హాజరై తెలంగాణ ప్రజల్లో కొత్త ఉత్సాహం నింపారు. ఇక బీజేపీ నాయకులు వరుసగా పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే అమిత్ షా తెలంగాణకు రాగా, తాజాగా పీఎం మోడీ తెలంగాణలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు.
వచ్చే నెల 3 లేదా 4 వ తేదీన రాష్ట్రానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ విషయమై పీఎంవో నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయానికి ఫోన్ వచ్చినట్లు తెలిసింది. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల పర్యటనకు మోదీ వస్తున్నట్లు పీఎంవో సమాచారం అందినట్లు తెలుస్తోంది.
అయితే సెప్టెంబర్ 17న ఓవైపు కాంగ్రెస్ సభ, మరోవైపు అమిత్ షా ( Amith sha ) సభ నిర్వహించారు. ఇక కాంగ్రెస్ సభ తుక్కుగూడలో నిర్వహిస్తే లక్షలాది మంది జనాలు తరలివచ్చి సభ సక్సెస్ అయింది. కానీ బిజెపి సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వచ్చినా కానీ, సభ సక్సెస్ కాలేక పోయింది. బండి సంజయ్ అధ్యక్ష బాధ్యతల తర్వాత స్పీడు తగ్గడం, చేరికలు లేకపోవడంతో బీజేపీ బలహీనపడుతోంది. ఈ నేపథ్యంలో మోడీ తెలంగాణలో పర్యటించి బీజేపీలో నూతనోత్సాహం నింపేందుకు కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read: Trisha Marriage: త్వరలో త్రిష పెళ్లి.. మలయాళ నిర్మాతతో ఏడడుగులు!