Modi new slogan : ఎన్నిక‌ల టార్గెట్ గా క‌విత‌, పార్టీల‌న్నీ ఆమె వైపే బాణాలు!!

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె చుట్టూ ఎన్నిక‌ల రాజ‌కీయం (Modi new slogan) తిరుగుతోంది. బీఆర్ఎస్ కు ఓటేస్తే క‌విత‌కు మేలుచేసిన‌ట్టే.

  • Written By:
  • Updated On - June 27, 2023 / 05:08 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె చుట్టూ ఎన్నిక‌ల రాజ‌కీయం (Modi new slogan) తిరుగుతోంది. బీఆర్ఎస్ కు ఓటేస్తే క‌విత‌కు మేలుచేసిన‌ట్టే అనే నినాదాన్ని ప్ర‌త్య‌ర్థులు త‌యారు చేస్తున్నారు. ప్ర‌త్యేకించి బీజేపీ ఆ నినాదాన్ని తీసుకుంది. ఆమెను అరెస్ట్ చేయ‌క‌పోవ‌డంతో గ్రాఫ్ ఢ‌మాల్ ను ప‌డిన విష‌యాన్ని గ‌మ‌నించిన ప్ర‌ధాని మోడీ స‌రికొత్త స్లోగ‌న్ అందుకున్నారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే క‌విత‌కు మేలు చేసిన‌ట్టే, కాంగ్రెస్ కు ఓటేస్తే కుటుంబ పార్టీకి మ‌ద్ధ‌తు ఇచ్చిన‌ట్టు అవుతుంద‌ని వినిపిస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మ‌ధ్య ఫెవికాల్ బంధం ఉంద‌ని ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో క‌విత ఎపిసోడ్ ను కాంగ్రెస్ చూపిస్తోది. ఆ కేసులో క‌విత‌ను అరెస్ట్ చేయ‌కుండా బీజేపీ వ‌దిలేసింద‌ని చెబుతోంది. ఇలా వ‌చ్చే ఎన్నిక‌ల్లో అన్ని పార్టీల‌కు క‌విత లిక్క‌ర్ స్కామ్ ఎపిసోడ్ కేంద్ర‌బిందువుగా మారింది.

కేసీఆర్ కుమార్తె చుట్టూ ఎన్నిక‌ల రాజ‌కీయం (Modi new slogan)

దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని పలుమార్లు సీబీఐ, ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత వెళ్లొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారం అప్పట్లో గల్లీ నుంచి ఢిల్లీ వరకూ మార్మోగింది. అదిగో అరెస్ట్.. ఇదిగో అంతా అయిపోయిందని బీజేపీ రాష్ట్ర నేతలు, అగ్రనేతలు కామెంట్స్ చేయని రోజు లేదు. ఇక తెలంగాణలో బండి సంజయ్, అరవింద్ ఇలాంటి వాళ్లు అయితే నోరు తెరిస్తే ‘కవిత అరెస్ట్’ అనే మాట తప్ప మరొకటి రాలేదు. దీంతో ఇక కవిత పని అయిపోయినట్లే.. అరెస్ట్ ఖాయం అని తెలంగాణ ప్రజలు భావించారు. అయితే అనుకున్నట్లు మాత్రం ఎందుకో జరగలేదు. ఆ మధ్య బీఆర్ఎస్-బీజేపీ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని కూడా వార్తలొచ్చాయి. అంతేకాకుండా నిన్న, మొన్నటి వరకూ బీజేపీ గురించి బీఆర్ఎస్‌ పొల్లెత్తి మాట అనకపోవడం.. బీఆర్ఎస్‌పై కూడా తగిలీతగలకుండా బీజేపీ విమర్శలు జరపడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే సీబీఐ, ఈడీ ఛార్జ్‌షీట్లలో కవిత పేరు ఎక్కడా లేకపోవడంతో ఇక ఇదే పక్కా అని అందరూ భావించారు. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు మంత్రి కేటీఆర్ స్వయంగా ఢిల్లీకెళ్లి మరీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయిట్మెంట్ అడగడంతో మరింత.(Modi new slogan) రచ్చ రచ్చ అయ్యింది.

బీజేపీ-బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని ఇప్పటికే కాంగ్రెస్ జనాల్లోకి

కవిత పేరును అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలని కాంగ్రెస్, బీజేపీ కూడా భారీ ప్లానింగ్‌లోనే ఉన్నాయి. ఎందుకంటే.. బీజేపీ-బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని ఇప్పటికే కాంగ్రెస్ జనాల్లోకి బాగా తీసుకెళ్లింది. ఎన్నికల వరకూ కవిత అరెస్ట్ కాకపోతే.. ఇది చీకటి ఒప్పందమే అని జనాల్లోకి తీసుకెళితే పార్టీకి అదే ప్లస్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేతలు భావిస్తున్నారట. ఇలా అస్తమాను కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తుండటంతో బీజేపీ ఆత్మరక్షణలో పడిపోయిందట. ఒకవేళ కవిత అరెస్ట్ జరగకపోతే.. కన్నడనాట ‘పే సీఎం’ పేరుతో ప్రచారం మొదలెట్టి బీజేపీని కుప్పకూల్చిన వ్యూహకర్త సునీల్ కనుగోలు.. తెలంగాణలో ఏ రేంజ్‌లో ప్లాన్ చేస్తారో ఒక్కసారి ఊహించుకోండి.

కవిత అరెస్ట్‌ను  సెంటిమెంట్ రగిలించడానికి బీఆర్ఎస్ రెడీ (Modi new slogan)

బీజేపీకి త్రివిధ దళాలు అని ఆరోపణలు వస్తున్న ఐటీ, ఈడీ, సీబీఐలను ఉసిగొల్పి సోదాలు చేయిస్తోందని ప్రతిపక్ష పార్టీలు  (Modi new slogan) దుమ్మెత్తిపోస్తున్నాయి. చాలా రోజులుగా బీఆర్ఎస్ కూడా.. కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన సందర్భాలున్నాయ్. వాస్తవానికి అప్పట్లో అధికార పార్టీ టార్గెట్‌గా చేసిన సోదాలతో పలువురు నేతలు బీజేపీలో చేరిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ మధ్య అలాంటిదేమీ జరగట్లేదు. దీనికి కారణం కవితను అడ్డుపెట్టుకుని మూడు పార్టీలు రాజకీయం చేస్తున్నాయి గనుక. కవిత అరెస్ట్ అయితే బాగుంటుందని.. ఆ సింపతీతో ఎన్నికల్లో పనికొస్తుందని బీఆర్ఎస్ భావిస్తోందట. ఇప్పటికే.. ఈ విషయాలన్నింటినీ జనాల్లోకి గులాబీ నేతలు బాగానే తీసుకెళ్లారు. ఈ పరిస్థితుల్లో కవిత అరెస్ట్ అయితే అన్నివిధాలుగా కలిసొస్తుందని బీఆర్ఎస్ భావిస్తోందట. అంటే.. కవిత అరెస్ట్‌ను రాజకీయ అస్త్రంగా, సెంటిమెంట్ రగిలించడానికి బీఆర్ఎస్ రెడీ అయ్యిందన్న మాట.

కవిత విషయంలో అగ్రనేతలు సరైన నిర్ణయం తీసుకోవట్లేదని

కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీలో పరిస్థితులు చాలావరకు మారాయన్నది జగమెరిగిన సత్యమే. ఒకప్పటికి, ఇప్పటికీ మార్పులు, చేర్పులు జరిగాయ్. నిన్న మొన్నటి వరకూ ‘మేమే ప్రధాన ప్రతిపక్షం.. మేమే బీఆర్ఎస్‌ను ఢీకొట్టేది.. మేమే నంబర్-02’ అని చెప్పుకున్న కమలనాథులు ఇప్పుడు ఆ మాటలు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే ఇప్పట్లో కవితను అరెస్ట్ చేస్తే మాత్రం అసలుకే ఎసరు వస్తుందని బీజేపీ భావిస్తోందట. అరెస్ట్ చేస్తే జనాల్లో బీజేపీకి ఉన్న పేరు కచ్చితంగా పోతుందని.. ఇన్నాళ్లు పార్టీ బలోపేతం కోసం కష్టపడిన శ్రమ మొత్తం వృథా అవుతుందని నేతలు అనుకుంటున్నారట. కవిత విషయంలో అగ్రనేతలు సరైన నిర్ణయం తీసుకోవట్లేదని.. చాలా మంది అసంతృప్తికి  (Modi new slogan) లోనవుతున్నారు.

Also Read : MLC Kavitha: గన్ పార్క్ నుండి అమరుల జ్యోతి వరకు ఎమ్మెల్సీ కవిత ర్యాలీ!

ఇప్పుడు కీలక నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ విషయంలోనే హర్టయ్యి పార్టీని వీడేంత పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే కవితను అరెస్ట్ చేయకపోవడమే బీజేపీకి పెద్ద మైనస్ అయ్యిందని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారట. ఇక బీఆర్ఎస్ కూడా అప్పట్లో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేసినంత పనిచేసి.. చివరికి చప్పుడు చేయలేదు. ఇలా చెప్పుకుంటూ బీజేపీ-బీఆర్ఎస్‌ల మధ్య చీకటి ఒప్పందం ఉన్నది పదే పదే రుజువు అవుతోందని రాజకీయ విశ్లేషకులు.. ఇరు పార్టీల కార్యకర్తల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం బీజేపీ పరిస్థితే అదేదో పాట ఉందే ‘అయ్యయ్యో చేతిలో డబ్బులు పాయెనే’ అన్నట్లుగా.. అందొచ్చిన అవకాశాన్ని చేజేతులారా వదులుకున్నదేమో అనే విమర్శలు,  (Modi new slogan) ఆరోపణలు లేకపోలేదు.

Also Read : CM KCR: కేసీర్ఆర్ బీజేపీ బీ టీమ్‌?

తెలంగాణలో ఇప్పటి వరకూ బీజేపీని బలోపేతం చేసుకోవడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకున్న కమలనాథులు.. కవితను అరెస్ట్ చేసే సువార్ణవాకాశం వచ్చినా వాడుకోలేదు. దీంతో జనాల్లో బీఆర్ఎస్-బీజేపీ మధ్య ఏదో నడుస్తోందనే చర్చ ఎప్పుడో మొదలైపోయింది. ఇప్పుడు బీజేపీ మనసు మార్చుకుని కవితను అరెస్ట్ చేయాలని అనుకున్నా కథ ఎలా ఉంటుందో ఇక చెప్పక్కర్లేదేమో. మొత్తం మీద ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిన బీజేపీని లేప‌డానికి మోడీ తీసుకున్న స్లోగ‌న్ బీఆర్ఎస్ కు ఓటేస్తే క‌విత‌కు మేలు చేసిన‌ట్టు, కాంగ్రెస్ కు ఓటేస్తే కుటుంబ పాల‌న‌కు ప‌ట్టంక‌ట్టిన‌ట్టు అంటూ త‌యారు చేశారు. ఇప్పుడు ఆ స్లోగ‌న్ ఫ‌లించే ప‌రిస్థితులు చేయిదాటాయ‌ని క‌మ‌ల‌నాథులు(Modi new slogan) గుర్తించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.