Kaleshwaram : కాళేశ్వరం పేరుతో బిఆర్ఎస్ కోట్ల రూపాయలు దోచుకుంది – ప్రధాని మోడీ

పటాన్‌చెరులో ఏర్పాటుచేసిన బీజేపీ విజయ సంకల్ప సభ (BJP Vijaya Sankalpa Sabha)లో ప్రధాని మోడీ (Modi) బిఆర్ఎస్ , కాంగ్రెస్ (BRS-COngress) పార్టీలపై విరుచుకపడ్డారు. కాళేశ్వరం (Kaleshwaram Lift Irrigation Project) పేరుతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయలు దోచుకుందని ఆరోపించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా పటాన్ చెరు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 9 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను మోడీ ప్రారంభించారు. మంగళవారం ఉదయం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి […]

Published By: HashtagU Telugu Desk
Modi Brs

Modi Brs

పటాన్‌చెరులో ఏర్పాటుచేసిన బీజేపీ విజయ సంకల్ప సభ (BJP Vijaya Sankalpa Sabha)లో ప్రధాని మోడీ (Modi) బిఆర్ఎస్ , కాంగ్రెస్ (BRS-COngress) పార్టీలపై విరుచుకపడ్డారు. కాళేశ్వరం (Kaleshwaram Lift Irrigation Project) పేరుతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయలు దోచుకుందని ఆరోపించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా పటాన్ చెరు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 9 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను మోడీ ప్రారంభించారు. మంగళవారం ఉదయం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సంగారెడ్డిలో పర్యటించి పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా బిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల ఫై నిప్పులు చెరిగారు. నాణేనికి ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్‌ ఉన్నాయని, ఆ రెండు పార్టీలు కుమ్మక్కయైట్లు ప్రజలందరికీ అర్థమైందని మోడీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్​ రెండు పార్టీలు ఒక్కటేనని దుయ్యబట్టారు. కాళేశ్వరం పేరుతో బిఆర్ఎస్ కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం తప్పులను కాంగ్రెస్ దాస్తుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణను కొత్త ఏటీఎంగా మార్చుకుందని ఆరోపించారు. నేనే మోడీ కుటుంబం అని సభికులతో నినాదాలు చేయించిన ప్రధాని, తెలంగాణ యువత స్వప్నాలను సాకారం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ దిశగానే 70 ఏళ్లలో కాంగ్రెస్‌ చేయలేని పనిని పదేళ్లలో చేసి చూపామని ప్రధాని ఉద్ఘాటించారు.

కోట్లాది ఎస్సీ యువత స్వప్నాలను సాకారం చేసినట్లు తెలిపిన ప్రధాని, తెలంగాణలో మాదిగల అభ్యున్నతి కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అవినీతిని బయటపెడుతున్నాననే అక్కసుతో, నాపై కాంగ్రెస్‌ విమర్శిస్తోంది. కుటుంబ పాలన సాగించే వారిలో అభద్రతా భావం ఎక్కువ. కుటుంబ పార్టీల నేతలు సొంత ఖజానా నింపుకుంటున్నారు. వారసత్వ నేతలకు భయం పట్టుకుంది. వారి అవినీతి దళాన్ని వెలికితీస్తున్నా, ప్రజల నమ్మకాన్ని నేనెప్పుడూ వమ్ము కానివ్వను. దోచుకున్న నల్లధనం దాచుకోవడానికే విదేశాల్లో ఖాతాలు తెరిచారు. 140 కోట్ల మంది ప్రజలే నా కుటుంబం.’ అని మోదీ వ్యాఖ్యానించారు.

Read Also : 2008 DSC Candidates : ప్రజా భవన్ వద్ద డీఎస్సీ 2008 బాధితుల ఆవేదన..

  Last Updated: 05 Mar 2024, 01:42 PM IST