Site icon HashtagU Telugu

Rains Alert : నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాలకు వర్షసూచన

Heavy Rains

Rains Alert : ఈరోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Rains Alert) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. నేడు, రేపు హైదరాబాద్‌లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 25 డిగ్రీల మేర ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు.

We’re now on WhatsApp. Click to Join

ఇవాళ, రేపు, ఎల్లుండి తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Also Read :Bank Jobs : ఏపీ, తెలంగాణలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు.. అప్లై చేసుకోండి

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా ప్రాంతంలో ఉన్న జిల్లాల్లో పలుచోట్ల నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. పలు తీర ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తాలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చని తెలిపింది.

Also Read :Earthquake : రష్యాలో భూకంపం.. వణికిపోయిన కమ్‌చట్కా.. సునామీ హెచ్చరిక జారీ

నేడు, రేపు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలో ఉన్న ఒకటి లేదా రెండుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చు. కొన్ని రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈవివరాలను అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది.

Also Read :Life Goal: మీరు విజయం సాధించాలంటే, మీరు సిగ్గు లేకుండా ఈ 4 పనులు చేయాలి..!