తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) ట్రాన్స్ జెండర్ల (Transgenders ) విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లో ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ వాలంటీర్లుగా (Use Transgenders as Traffic Volunteers)ఉపయోగించుకోవాలని ఆదేశించారు. నిత్యం లక్షలాది వాహనాలు, అకాల వర్షాలు, ప్రముఖుల పర్యటనలు, వారాంతపు వేళల్లో ట్రాఫిక్ జామ్‌లు ఇదీ మన భాగ్యనగర ప్రస్తుత పరిస్థితి. ఇటువంటి క్లిష్టమైన హైదరాబాద్ నగర ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్‌జెండర్లను వాలంటీర్లుగా నియమించాలని ఆదేశాలు జారీ చేసారు.
ఈ నిర్ణయంతో ట్రాన్స్జెండర్ల గౌరవం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో రిజిస్టర్ అయిన ట్రాన్స్‌జెండర్లు 3,000 మందికి పైగా ఉంటే, నగరంలోనే 1000 మంది ఉన్నట్టు అంచనా. అయితే ట్రాఫిక్ వాలంటీర్లుగా పని చేసే ట్రాన్స్ జెండర్ల కోసం వేర్వేరు డిజైన్లతో విభిన్నమైన యూనిఫామ్స్ రూపొందించడంలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఈ మేరకు యూనిఫామ్స్ సంబంధించిన నమూనాను రిలీజ్ చేసింది. ఈ వాలంటీర్లు నగరంలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తారని ప్రభుత్వం చెప్పింది.
ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో పోలీసులు, హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు. హోంగార్డుల తరహాలో ట్రాన్స్‌జెండర్లను వాలంటీర్లుగా నియమించనున్నారు. తొలుత ఆసక్తిగల వారి జాబితా సిద్ధం చేయనున్నారు. అనంతరం అర్హులైన వారిని ఎంపికచేసి 10రోజుల పాటు ట్రాఫిక్ విధులపై శిక్షణ ఇవ్వనున్నారు. వీరికి ప్రత్యేక యూనిఫాం అందజేస్తారు. ప్రతినెలా ట్రాన్స్‌జెండర్ వాలంటీర్లకు నిర్దేశించిన స్టైఫండ్ ఇస్తారు. ఈ మేరకు వీలైనంత త్వరితగతిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సీఎం సూచించారు.
Read Also : Holidays Effect : ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు