MLC Takkallapalli Ravinder Rao : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి ..కాంగ్రెస్ గూటికి చేరతారా..?

తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ (KCR) లెక్క తప్పింది..సంక్షేమ పథకాలు..ఆసరా పెన్షన్లు ..24 గంటల కరెంట్ ..రైతు బంధు ఇలా ప్రభుత్వ పథకాలు మరోసారి పట్టం కట్టపెడతాయని భావించారు..కానీ ప్రజలు మాత్రం ముక్తకంఠంతో కాంగ్రెస్ (Congress) కు జై కొట్టారు. బిఆర్ఎస్ కేవలం 39 స్థానాలకే పరిమితం కావడం వెనుక కేసీఆర్ తీసుకున్న కారణమే అని ప్రతి ఒక్కరు అంటున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి ఛాన్స్ ఇవ్వడమే బిఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణం. ఇదే విషయాన్నీ ఇప్పుడు […]

Published By: HashtagU Telugu Desk
Brs Mlc Takkallapalli Ravin

Brs Mlc Takkallapalli Ravin

తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ (KCR) లెక్క తప్పింది..సంక్షేమ పథకాలు..ఆసరా పెన్షన్లు ..24 గంటల కరెంట్ ..రైతు బంధు ఇలా ప్రభుత్వ పథకాలు మరోసారి పట్టం కట్టపెడతాయని భావించారు..కానీ ప్రజలు మాత్రం ముక్తకంఠంతో కాంగ్రెస్ (Congress) కు జై కొట్టారు. బిఆర్ఎస్ కేవలం 39 స్థానాలకే పరిమితం కావడం వెనుక కేసీఆర్ తీసుకున్న కారణమే అని ప్రతి ఒక్కరు అంటున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి ఛాన్స్ ఇవ్వడమే బిఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణం. ఇదే విషయాన్నీ ఇప్పుడు బిఆర్ఎస్ నేతలు సైతం చెపుతున్నారు. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ (MLC Takkallapalli Ravinder Rao) చెప్పడమే కాదు కేసీఆర్ ఫై కాస్త ఆగ్రహం కూడా వ్యక్తం చేసారు.

శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో జర్నలిస్ట్ లతో చిట్..చాట్ లో ఆయన… వరంగల్ ఆత్మ గౌరవం ఉన్న జిల్లా అయిన వరంగల్ నుంచి ఎర్రబెల్లి, సత్యవతికి మంత్రి పదవులు ఇస్తే ఉద్యమకారులు బాధ పడ్డారాన్నారు.. తెలంగాణ వాదం, ఉద్యమం తెలియని వారికి మంత్రి పదవి ఇస్తే ఎట్లా అధినేత వాస్తవాలు వినే అవకాశం ఇస్తే ఎవరైనా చెబుతారు వాస్తవాలు చెప్పే వారు బయట, జోకుడు గాల్లు లోపల ఉంటే ఎలా వాస్తవాలు తెలుస్తాయి అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎర్రబెల్లిని మంచి లీడర్ అంటే ప్రజలు ఉరికించి కొడతారు. ఎర్రబెల్లి చక్కిలి గింతలు పెట్టడం తప్పా ఎవ్వరికీ రూపాయి సహాయం చేయరు. కొన్ని జిల్లాల్లో మా ఎమ్మేల్యేలు ప్రజలకు ఇరిటేషన్ పెంచారు. దానిని ఎలా మేనేజ్ చేయాలో పార్టీకి ప్లాన్ లేకపోతే ఎలా గెలుస్తాం అన్నారు. వరంగల్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ అవసరం లేదు కుక్కలు కూడా వారి వెంట పడవు ఎద్దేవా చేశారు. ఇక ఖమ్మంలో ప్రతిసారి బయట గెలిచిన వారిని పార్టీలోకి తెచ్చుకోవడం వల్ల..సొంత పార్టీ నేతలు గ్రూపులుగా విడిపోయి..చివరకు పార్టీ గెలవకుండా అయిపోయిందన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం తక్కెళ్లపల్లి రవీందర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి. ఈయన మాటలు బట్టి చూస్తే త్వరలోనే బిఆర్ఎస్ ను వీడడం ఖాయమని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. రవీందర్ రాజకీయ ప్రస్థానం చూస్తే..1983లో టీడీపీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన టీడీపీలో గ్రామ పార్టీ అధ్యక్ష స్థానం నుంచి ఉమ్మడి వరంగల్‌ జిల్లా సంయుక్త కార్యదర్శిగా వివిధ హోదాల్లో పని చేసి 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించాడు. కానీ కొన్ని కారణాల వల్ల వేం నరేందర్‌రెడ్డికి టికెట్ దక్కడంతో ఆయన గెలుపు కోసం పని చేశాడు. రవీందర్ రావు 2007లో BRS(TRS) పార్టీలో చేరాడు. ఆయన వరంగల్‌ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షునిగా, రాష్ట్ర కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా వివిధ హోదాల్లో పని చేశాడు. 2019లో హుజూర్‌నగర్‌ నియోజకవర్గం, 2021లో నాగార్జునసాగర్‌ నియోజకవర్గం ఉప ఎన్నికల ఇన్‌ఛార్జిగా పని చేశాడు. ఆ తర్వాత తెలంగాణ శాసనమండలికి 2021లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో 16 నవంబర్ 2021న టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారై, నవంబర్ 22న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.

Read Also : Jail for BJP MLA: మైనర్ బాలికపై అత్యాచారం కేసు.. బీజేపీ ఎమ్మెల్యేకు 25 ఏళ్లు జైలుశిక్ష

  Last Updated: 15 Dec 2023, 07:45 PM IST