Site icon HashtagU Telugu

Kavitha Letter: రేపు విచారణకు హాజరుకాలేను.. ఈడీకి కవిత రిక్వెస్ట్!

Kavitha

Kavitha

ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Scam) కేసులో భాగంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విచారణ నిమిత్తం రేపు ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక కవిత అరెస్ట్ ఖాయమే అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో బీఆర్‌ఎస్‌ వర్గాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఈడీ నోటీసులపై ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) స్పందించారు. ఈడీకి వినతి పత్రం కూడా రాసింది.

చట్టంపై నమ్మకంతో విచారణకు సహకరిస్తానని..కానీ ధర్నా కారణంగా విచారణకు హాజరుకావాలా వద్దా అని న్యాయ సలహా తీసుకుంటానన్నారు. తాజా సమాచారం ప్రకారం ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఈడీకి లేఖ రాశారు. రేపు విచారణకు హాజరు కాలేరని లేఖలో పేర్కొన్నారు. 10న ఢిల్లీలో ధర్నా కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. అయితే గతంలో కూడా సీబీఐ విచారణ సందర్భంగా కవిత ఇదే తరహాలో లేఖ రాయడంతో సీబీఐ కొద్దిరోజులు అవకాశం ఇచ్చింది. మరి కవిత (MLC Kavitha) లేఖపై ఈడీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Also Read: Dogs Video: చిన్నారిని వెంబడించిన కుక్కలు.. వైరల్ అవుతున్న వీడియో