Site icon HashtagU Telugu

Sonia Gandhi ‘6 Guarantees’ : కాంగ్రెస్ గ్యారెంటీ పథకాలపై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సెటైర్లు

Mlc Kavitha Satire

Mlc Kavitha Satire

కాంగ్రెస్ గ్యారెంటీ పథకాల (Congress ‘6 Guarantees’)పై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) సెటైర్లు వేసింది. తెలంగాణ లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పక్క ప్రణాళికలతో ప్రజల్లోకి వెళ్తుంది. కర్ణాటక లో ఎలాగైతే ఉచిత పథకాలతో అధికారంలోకి వచ్చిందో..అదే ఉచిత పథకాలతో తెలంగాణ లో అధికారం లోకి రావాలని చూస్తుంది. ఇందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ లో కాంగ్రెస్ విజయ భేరి పేరిట భారీ సభ నిర్వహించింది కాంగ్రెస్. ఈ సభలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రకటించి ప్రజల్లో ఆనందం నింపింది. ఈ పథకాలతో ప్రజల్లోకి వెళ్లాలని చూస్తుంది.

ఆ పధకాలు చూస్తే.. ప్ర‌తి మ‌హిళ‌కూ రూ.2500 చొప్పున ఆర్థిక సాయం , మ‌హిళ‌ల‌కు టీఎస్ ఆర్టీసీలో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి ఉచిత ప్ర‌యాణం , వంట గ్యాస్ సిలిండ‌ర్‌ను రూ.500కే ఇవ్వ‌డం, రైతులు, కౌలు రైతుల‌కు ఎక‌రాకు రూ.15000 చొప్పున ఆర్థిక సాయం, వ్య‌వ‌సాయ కార్మిక‌కుల‌కు రూ.12000 ఆర్థిక సాయం. క్వింటా ధాన్యం ఉత్ప‌త్తికి రూ.500 బోన‌స్‌(ఎంఎస్‌పీకి) , 5 ల‌క్ష‌ల మంది ఇళ్లులేని పేద‌ల‌కు ఇందిర‌మ్మ ఇళ్లు , తెలంగాణ ఉద్య‌మ కారుల కుటుంబాల‌కు 250 గ‌జాల స్థ‌లాల పంపిణీ , గృహ జ్యోతి ప‌థ‌కం కింద 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్‌ , యువ‌వికాసం ప‌థ‌కం కింద విద్యా భ‌రోసా కార్డులు.. ప్ర‌తి విద్యార్థికీ రూ.5 ల‌క్ష‌ల సాయం , అన్ని మండ‌లాల్లోనూ అంత‌ర్జాతీయ స్థాయి పాఠ‌శాల‌ల నిర్మాణం , చేయూత ప‌థ‌కం కింద సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు నెల‌నెలా రూ.4 వేల పింఛ‌న్‌, రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆరోగ్య బీమా అందజేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.

ఈ పథకాలపై బిఆర్ఎస్ విమర్శలు , సెటైర్లు చేస్తుంది. ఇప్పటికే మంత్రి కేటీఆర్ ఈ పథకాలపై స్పందించగా..తాజాగా ఎమ్మెల్సీ కవిత సెటైర్లు వేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు ఫన్నీగా ఉన్నాయన్నారు. ఈ పదేళ్లలో తెలంగాణ గురించి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఏమీ మాట్లాడలేదని.. 9 మండలాలను తెలంగాణ నుంచి ఏపీలో కలిపితే వారిద్దరు ప్రశ్నించలేదని మండిపడ్డారు.

తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. తెలంగాణ ప్రజల మనోభావాలతో కాంగ్రెస్ పార్టీ ఆటలాడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు నిర్ణయాల వల్లే దశాబ్దాల పాటు అనేకమంది యువత ప్రాణాలు కోల్పోయారన్నారు. 2004లోనే తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి.. పదేళ్లు కాలయాపన చేశారని, ఫలితంగా ఎంతో మంది ఉద్యమకారులు అమరులయ్యారని అన్నారు. అలాంటివారు రేపు తెలంగాణలో అధికారంలోకి వస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు అన్ని తెలుసన్న కవిత.. ఎవరికి ఓటు వేస్తే బాగుంటుందో తెలుసన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆలస్యం చేసినట్లుగానే వారు ఇచ్చిన హామీలను కూడా అధికారంలోకి రాగానే చేస్తారనే గ్యారెంటీ లేదని ఎద్దేవా చేశారు.

Read Also : Jio Air Fiber: వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన జియో ఫైబర్.. తేడాలు ఇవే?