Site icon HashtagU Telugu

Kavitha on Adani: ప్రజల పైసలతో ఆటలా.. అదానీ ఇష్యూపై కవిత రియాక్షన్!

Kavitha

Kavitha

ఆదానీ (Adani) కుంభకోణంలో ప్రజలు పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసి సంస్థ డబ్బులు ఆవిరవుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని బీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ప్రశ్నించారు. అదాlనీ కంపెనీల్లో ఎల్ఐసి పెట్టిన పెట్టుబడుల విలువ 11 శాతం మేర పడిపోవడం పట్ల కవిత తీవ్రంగా స్పందిస్తూ కేంద్రానికి ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజల డబ్బులతో ఆటలాడటం ఏంటని ధ్వజమెత్తారు. ఎల్ఐసిలో పెట్టుబడులు పెట్టిన మధ్య తరగతి ప్రజలకు మోదీ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు.

ఇంత పెద్ద కుంభకోణం జరిగి దాదాపు 12 లక్షల కోట్లు నష్టపోయినా సిబిఐ ఈడి రిజర్వ్ బ్యాంకు వంటి సంస్థలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయని ప్రశ్నించారు. సంస్థలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే సంస్థలేనా అని (MLC Kavitha) నిలదీశారు.

హిడెన్బర్గ్ నివేదిక బహిర్గతం అయినప్పటి నుంచి ఆదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉందని గుర్తు చేశారు. అప్పుడే కేంద్రం జెపిసి ఏర్పాటు చేస్తే ప్రజలు మరింత నష్టపోయేవారు కాదని తెలిపారు. ఇప్పటికైనా కేంద్రం కళ్ళు తెరిచి మరింత నష్టం జరగకుండా చూడాలని సూచించారు. జేపీసీని నియమించాలని డిమాండ్ కవిత (MLC Kavitha) డిమాండ్ చేశారు.

Also Read: Lokesh Calls Jr.NTR: టీడీపీ సంచలనం.. జూనియర్ NTRకు లోకేష్ పిలుపు!