లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) కేసు లో తీహార్ జైలులో గత నాల్గు నెలలుగా ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) అనారోగ్యం బారిన పడడం..ఆమెను దీన్ దయాల్ హాస్పిటల్‌కు తరలించడం ఆమె కుటుంబ సభ్యులను , పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేసింది. గత కొంతకాలంగా కవిత లోబీపీతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈమె అరెస్టయిన సమయంలో కూడా అదే సమస్యతో ఉన్నారు. అప్పటి నుండి కూడా ఇంటి నుంచే మెడిసిన్ అందిస్తున్నారు. మధ్య మధ్యలో జైలులో వైద్యులతో చికిత్స అందిస్తున్నారు. ఈరోజు సడెన్ గా తీవ్ర అస్వస్థతకు గురికావటంతో.. వెంటనే హాస్పటల్ కు తరలించారు. ప్రస్తుతం కవిత ఆరోగ్యం బాగానే ఉండడం తో డాక్టర్స్ డిశ్చార్జ్ (MLC Kavitha Discharge) చేసారు. దీంతో అధికారులు ఆమెను మళ్లీ తీహార్ జైలుకు తరలించారు. కవిత క్షేమంగా ఉన్నారని తెలియడంతో గులాబీ కార్యకర్తలు ఊపీరి పీల్చుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ను మార్చి 15న అదుపులోకి తీసుకున్నారు. మార్చి 26 న జ్యూడీయల్ ఖైదీగా కవిత తీహార్ జైలు కు తరలించారు. అప్పటి నుండి బెయిల్ కోసం కవిత.. పలుమార్లు పిటిషన్లు దాఖలు చేయగా.. ప్రతిసారీ నిరాశే ఎదురవుతూ వస్తోంది. కవిత బెయిల్ పిటిషన్లను రౌస్ ఎవెన్యూ కోర్టు తిరస్కరించగా.. అటు ఢిల్లీ హైకోర్టు కూడా నిరాకరించింది. ఈ కేసులో కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్, డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై విచారణ జూలై 22కు వాయిదా వేసింది. మద్యం కేసులో కవిత పాత్ర, ఈ నేపథ్యంలోనే సాక్ష్యాలతో కూడిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను దాఖలు చేసినట్టు సీబీఐ కోర్టుకు తెలిపింది. దానిని పరిగణనలోకి తీసుకోవాలని న్యాయ స్థానాన్ని కోరింది. ఈ అంశంపై విచారణ చేపడతామని న్యాయమూర్తి భవేజా తెలిపారు. జులై 22 న ఏంజరుగుతుందనేది చూడాలి.
Read Also : T SAT : టి సాట్ ప్రసారాలకు ఎటువంటి ఇబ్బంది లేదు – సీఈవో వేణుగోపాల్ రెడ్డి