Site icon HashtagU Telugu

TS Assembly : మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై న్యాయ విచారణ జరిపించాలి – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Jeevan Reddy

Jeevan Reddy

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (TS Assembly) శనివారం వాడివేడిగా నడిచాయి. బిఆర్ఎస్ vs కాంగ్రెస్ (BRS Vs Congress) గా మారింది. ఇరు నేతలు ఎక్కడ తగ్గేదెలా అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు , ప్రతివిమర్శలు చేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt) రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని అధికార పార్టీ నేతలు అంటున్నారని.. అప్పుల గురించే కాదు బీఆర్ఎస్ హయాంలో తాము సృష్టించిన ఆస్తుల గురించి కూడా మాట్లాడాలని కేటీఆర్ (KTR) అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి , తీసుకొచ్చిన పథకాలు మొదలగు వాటి గురించి ప్రస్తావించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదే క్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డ్డి (MLC Jeevan Reddy) మాట్లాడుతూ..మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై న్యాయ విచారణ జరిపించాలని అన్నారు. ప్రభుత్వంపై భారం పడకుండా కాంట్రాక్ట్ కంపెనీతోనే ప్రాజెక్టును పునరుద్ధరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. శాసనమండలిలో గవర్నర్ తమిళిసై ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ఆయన ప్రతిపాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టను గత ప్రభుత్వం సాగునీటి కోసం వినియోగించకుండా.. పర్యాటకంగా వాడుకుందని విమర్శించారు. సాగు నీటి హక్కులు కాపాడటంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథపై విచారణ జరిపించాలని జీవన్ రెడ్డి కోరారు. కమీషన్ల కోసమే మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టారని ఆరోపించారు. అన్ని వసతులు ఉన్నా రామగుండం కాదని యాదాద్రిలో పవర్‌ ప్లాంట్‌ పెట్టారన్నారు. విద్యుత్‌ శాఖలో 80 వేల కోట్ల అప్పులు చేశారని మండిపడ్డారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయాలన్నారు. కేంద్రం వివక్ష వల్ల ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించలేకపోయామని చెప్పుకొచ్చారు.

గత పదేళ్ల పాలనపై మాట్లాడమంటే బీఆర్ఎస్ భయపడుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత 10ఏళ్లను వదిలేసి ఉమ్మడి పాలన గురించి మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. కొంతమంది ఎన్నారైలకు ప్రజాస్వామిక స్ఫూర్తి అంటే అర్థం తెలియక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎంత చెప్పినా ఆ ఎన్నారైలు అర్ధచేసుకోరని విమర్శించారు. సభ్యుల సంఖ్య ముఖ్యం కాదు.. ప్రజాసౌమ్య స్ఫూర్తి ముఖ్యమన్నారు. గత పాలనలో కేసీఆర్‌కు వివిధ పదవులు ఇచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ అని గుర్తు చేసారు.

Read Also : Telangana: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను సన్మానించిన ఎఫ్‌ఎన్‌సిసి మెంబర్స్