Site icon HashtagU Telugu

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఈ ముగ్గురు నేతలకు కీలకం!

MLC Elections

MLC Elections

MLC Elections: తెలంగాణ‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) వేడి పెరిగింది. ఓ వైపు ఎండలు పెరుగుతుంటే.. మరోవైపు ఎన్నికల వేడి కూడా అదే స్థాయిలో పెరిగింది. పోలీంగ్‌కు మరో పది రోజులు గడువు ఉండటంతో నేతల హంగామా చేస్తున్నారు. ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై బీజేపీ మరింత ఫోకస్ పెట్టింది. అయితే ఈ ఎన్నికలు ముగ్గురు నేతలు బండి సంజయ్, ధ‌ర్మ‌పురి అర్వింద్‌, రఘునందన్ రావు అత్యంత కీలకంగా మారనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలే.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయి.

కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులతో పాటు టీచర్ ఎమ్మెల్సీ పొలింగ్‌ ఈ నెల 27న జరగనుంది. ముఖ్యంగా పట్టభద్రుల ఎన్నికను అటు కాంగ్రెస్ తో పాటు.. ఇటు బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సుమారుగా 3 లక్షల 50 వేల‌కుపైగా పట్టభద్రుల ఓట్లు ఉన్నాయి. అంతేకాకుండా 45 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తర తెలంగాణ మొత్తం ఈ ఎన్నికల ప్రభావం ఉంటుంది. గత అసెంబ్లీతో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ సత్తా చాటింది. 7 అసెంబ్లీ స్థానాలతో పాటు 4 పార్లమెంట్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అంతేకాకుండా బీజేపీలో ఫైర్ బ్రాండ్ గా పిలిచే.. ముగ్గురు నేతలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నారు. కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ ఎమ్మెల్సీ పరిధిలోనే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ముగ్గురు నేతలు అటు కాంగ్రెస్ తో పాటు ఇటు బీఆర్ఎస్‌పైన‌ తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ నుంచి అంజిరెడ్డి బరిలో ఉన్నారు. మొన్నటివరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో సరిగా సమయం ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ప్రచారంపై ఫోకస్ పెడుతారని పార్టీ శ్రేణులు అంటున్నాయి.

Also Read: Peddgattu Jatara: పెద్ద‌గ‌ట్టు జాత‌ర‌.. భ‌క్తుల కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికంగా ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయి. సుమారుగా ల‌క్ష 70 వేల మంది ఓటర్లు ఉన్నాయి. ఇక్కడ ఏ పార్టీకి అధికంగా ఓట్లు వేస్తే ఆ పార్టీ గెలిచే అవకాశం ఉంది. దీంతో బండి సంజయ్ ఇక్కడ మరింత దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా పార్టీ శ్రేణులను మరింత పరుగులు పెట్టించనున్నారు. ఇప్పటికీ పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఓటరను పోలింగ్ బూత్‌కు వచ్చే విధంగా దృష్టి పెడుతున్నారు. అదే విధంగా ధర్మపురి అర్వింద్ ఈ ఎన్నికలు కీలకం. నిజామాబాద్ లో కూడా పట్టభద్రుల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. ఆయన కూడా మరింత ఫోకస్ పెట్టనున్నారు. అంజిరెడ్డి.. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఈ నేపథ్యంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఇక్కడ అధిక ఓట్లు సాధించే విషయంలో దృష్టి పెడుతున్నారు. రఘునందన్ రావు ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఈ ముగ్గురు నేతలకు ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే గ్రౌండు లెవల్‌లో బీజేపీ శ్రేణులు ప్రతి ఓట‌ర్‌ని కలిసే విధంగా ప్రణాళికను రూపొందించుకున్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లలో నియోజకవర్గం ఇంచార్జ్‌ని నియమించి ప్రతిరోజు రిపోర్ట్ అధిష్టానంకి పంపుతున్నారు.