Telangana Congress: సర్వే ఆధారంగా గెలుపు గుర్రాలకే టికెట్లు

ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అధికార బీఆర్ఎస్, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

Telangana Congress: ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అధికార బీఆర్ఎస్, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరీ ముఖ్యంగా గ్రామస్థాయిలో పలుకుబడి ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది. ఆ పార్టీ కూడా కెసిఆర్ కు మేమె గట్టిపోటీ అంటూ చెప్పుకుంటుంది. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ లో భారీ చేరికలకు సన్నాహాలు జరుగుతున్నాయట. ఇప్పటికే పొంగులేటి, జూపల్లి టచ్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే వచ్చే ఎన్నికల నాటికి టికెట్ కేటాయింపుల విషయమై అధిష్టానం చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు.

బుధవారం విలేకరులతో మాట్లాడిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులు సర్వే ఆధారంగానే ఇస్తామంటూ చెప్పారు. కొత్తగా పార్టీలో జాయిన్ అయిన వారికైనా, నాతో పాటుగా అందరికీ సర్వే ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామంటూ పేర్కొన్నారు. కర్ణాటకలో కూడా సర్వే ఆధారంగానే టికెట్లు కేటాయించినట్లు రేవంత్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు ప్రజలకు చేరువ కావాలని, ప్రతి ఒక్కరిపై హైకమాండ్ ఫోకస్ చేస్తుందని స్పష్టం చేశారు రేవంత్.

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 80 సీట్లకు పైగా గెలుచుకుని అధికారం చేపడుతుందని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి నేతలపై రేవంత్ మాట్లాడారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలపై చర్చిస్తామని తెలిపారు రేవంత్ రెడ్డి.

Read More: GT vs CSK: CSK జెర్సీ ధరించినందుకు ట్రోల్స్