Site icon HashtagU Telugu

MLA Tellam Venkata Rao : బిఆర్ఎస్ లో చేరడం ఫై భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు క్లారిటీ

Bhadrachalam Mla Tellam Ven

Bhadrachalam Mla Tellam Ven

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Election ) ) బిఆర్ఎస్ (BRS) తరపున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు (MLAS)..ఇటీవల కాంగ్రెస్ (Congress) లో చేరిన సంగతి తెలిసిందే. ఒకరిద్దరు కాదు దాదాపు 09 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకొని బిఆర్ఎస్ కు భారీ షాక్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆలా చేరిన ఎమ్మెల్యేలతో పాటు బిఆర్ఎస్ ను వీడిన నేతలు కూడా తిరిగి సొంత గూటికి రాబోతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఈరోజు మంగళవారం గద్వేల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ (MLA Krishna MOhan) ..కాంగ్రెస్ ను వీడి కేటీఆర్ (KTR) సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ ఛాంబర్ లో కేటీఆర్ తో సమావేశమై..అనంతరం బిఆర్ఎస్ లోనే ఉన్నానని..తాను ఏ పార్టీలోకి వెళ్లలేదని పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదే సమయంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు (MLA Tellam Venkata Rao) సైతం బిఆర్ఎస్ నేతలతో కలిసి ఉండడం..ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తో మాట్లాడుతూ కనిపించేసరికి ఈయన కూడా తిరిగి బిఆర్ఎస్ లో చేరబోతున్నారని ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారం ఫై ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు క్లారిటీ ఇచ్చారు. మీడియా చిట్ చాట్ లో తాను బిఆర్ఎస్ లో చేరుతున్న ప్రచారాన్ని ఖండించారు. బిఆర్ఎస్ లో కొందరు అల్ప సంతోషులు ఉన్నారు. నా ఫోటో తీసి పార్టీ మారుతారని ప్రచారం చేస్తున్నారు.

చాలా మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యే లు కాంగ్రెస్ మంత్రుల చాంబర్ లకు వచ్చి కలుస్తున్నారు.. వారంతా పార్టీ మారేవారేనా..పార్టీ మారే ప్రసక్తే లేదు..కాంగ్రెస్ తోనే నా ప్రయాణం అని క్లారిటీ ఇచ్చారు. ఈ క్లారిటీ తో ఈయన పార్టీ మారడం లేదని తెలుస్తుంది. మరి నిజంగా తన మనసులో నుండి వచ్చిన మాటలా..లేక ఇప్పుడే ఎందుకు అని ఆలా చెప్పాడా..? అనేది కొద్దీ రోజులు ఆగితే కానీ తెలియదు.

Read Also : Gaddar Awards : రేవంత్ గుర్తు చేస్తే తప్ప చిరంజీవి కి గద్దర్ అవార్డ్స్ గుర్తుకు రావా..?