Eknath Shinde Revanth : రేవంత్ రెడ్డి ని ఏక్‌నాథ్ షిండే తో పోల్చిన పాడి కౌశిక్‌ రెడ్డి

  • Written By:
  • Publish Date - February 17, 2024 / 11:31 AM IST

రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్ షిండే అవుతాడంటూ హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి (MLA Kaushik Reddy) అన్నారు. సీఎం హోదాలో ఉండి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రతిపక్షాలపై నోటికి వచ్చినట్లు మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. కేసీఆర్(KCR) ఇచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని…అసలు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు ? భర్తీ ఎప్పుడు జరిగిందో చెప్పాలని కౌశిక్ డిమాండ్ చేసారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళతాడని.. ఆ కేసును తప్పించుకునేందుకు…ఏక్‌నాథ్ షిండే అవుతాడంటూ సీఎం ఫై కీలక ఆరోపణలు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

కాంగ్రెస్‌ పార్టీలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎంకి రివర్స్‌ అయ్యే అవకాశం ఉందని , రేవంత్ రెడ్డి పాతలాజికల్ లయర్, ప్రతి నిత్యం అబబ్ధాలు ఆడడమే పనిగా పెట్టుకునే వాడిని పాతాలాజికల్ లయర్ అంటారన్నారు. అంటే రోగలక్షణ అబద్ధాల కోరు అని అర్థమని చెప్పారు. హరీష్ రావు పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి అధికారం శాశ్వతం కాదని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.

ఇదిలా ఉంటె తెలంగాణ శాసనసభ సమావేశాలు చివరి రోజుకు చేరుకున్నాయి. నీటిపారుదల రంగంపై నేడు శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేసారు. దీనిపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. ఈ నెల 8 నుంచి మొదలయిన సమావేశాలు వాడీ వేడీగా నాయకుల మధ్య వాదనలు జరిగాయి. మొదటిగా గవర్నర్​ ప్రసంగాన్ని ప్రవేశపెట్టగా, దానిపై చర్చ జరిగిన అనంతరం సభ ఆమోద ముద్ర వేసింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఓట్​ ఆన్​ అకౌంట్​ను నాలుగు నెలల కాల పరిమితికి సభలో ప్రవేశపెట్టింది. దీనిపై సుదీర్ఘంగా చర్చ కొనసాగుతోంది. ఈరోజు తో సమావేశాలు ముగియనున్నాయి.

Read Also : Uttam Kumar Reddy : అన్నారం ప్రాజెక్టులోనూ లీకులు