Congress MLAs Meeting : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏదో జరిగిపోతోందని.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారంటూ బీజేపీ, బీఆర్ఎస్‌లకు వత్తాసు పలికేలా పలు మీడియాలలో తప్పుడు కథనాలను ప్రసారం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ మోడ్‌లోకి వచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారంటూ ఆయా కథనాల్లో ప్రస్తావించారు. దీంతో ఆయన ఆ సమావేశానికి సంబంధించిన కీలక వివరాలను బహిరంగంగా వెల్లడించారు. ఈమేరకు సమాచారంతో సీఎం రేవంత్‌కు లేఖ రాశారు. అందులోని వివరాలను తెలుసుకుందాం..
Also Read :CM Chandrababu : తెలుగు ఓటర్లే టార్గెట్.. ఇవాళ ఢిల్లీలో చంద్రబాబు ప్రచారం
పరువునష్టం దావా వేస్తా .. నాయిని రాజేందర్ రెడ్డి వార్నింగ్
‘‘కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఒకచోటుకు చేరి అభివృద్ధిపై చర్చిస్తే తప్పేముంది ?’’ అని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(Congress MLAs Meeting) ప్రశ్నించారు. ఆ సమావేశం పేరుతో కొందరు యూట్యూబర్లు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తప్పుడు కథనాలను ప్రసారం చేశారని ఆయన మండిపడ్డారు. దీనిపై ఇవాళే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేస్తానని నాయిని తెలిపారు. తాను ఆ సమావేశంలో పాల్గొనలేదని నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ’ అనే వార్తల్లో నిజం లేనే లేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే కొందరు కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్ర పన్నుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నా వదిలేది ప్రసక్తే లేదన్నారు. తమపై, కాంగ్రెస్ పార్టీపై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన యూట్యూబర్లపై పరువు నష్టం దావా వేస్తానని నాయిని రాజేందర్ ప్రకటించారు.
సైబర్‌క్రైమ్‌కు ఫిర్యాదు
ఈ ప్రచారానికి తెర దించేందుకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమైంది. ఆ సమావేశానికి ఎవరూ హాజరుకాలేదని పేర్కొంటూ మీడియాకు వివరణ ఇచ్చింది. తప్పుడు ప్రచారం చేసిన వారి గుట్టు రట్టు చేయాలని సైబర్‌క్రైమ్‌కు ఫిర్యాదు చేసింది.
Also Read :MLAs Secret Meeting : కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశంపై రాద్ధాంతం.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర ?
అసలేం జరిగింది ?
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారంటూ పలువురు యూట్యూబర్లు ప్రచారం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన టీపీసీసీ సారథి మహేశ్‌కుమార్‌గౌడ్ దీనిపై అనిరుధ్‌రెడ్డి నుంచి సమాచారాన్ని సేకరించారు. పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలతో కలిసి భోజనం చేసేందుకు మాత్రమే ఆ సమావేశాన్ని నిర్వహించానని అనిరుధ్‌రెడ్డి వివరణ ఇచ్చుకున్నట్లు తెలిసింది. తాము సీఎంకు కానీ, కాంగ్రెస్‌కు కానీ వ్యతిరేకం కాదని అనిరుధ్‌రెడ్డి తేల్చి చెప్పారట. అయితే ఆ సమావేశంలో పాల్గొన్న ఇంకొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీపీసీసీ చీఫ్ వివరణ కోరగా.. తాము నియోజకవర్గ స్థాయి సమస్యలపై చర్చించుకునేందుకే భేటీ అయ్యామని చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై మరింత వివరణ ఇచ్చేందుకు అనిరుధ్‌రెడ్డి త్వరలోనే సీఎం, పీసీసీ చీఫ్‌తో ప్రత్యేక భేటీ కానున్నారు.