Site icon HashtagU Telugu

Japan Mallareddy : జపాన్ మల్లారెడ్డి.. వేషధారణ మార్చేసి.. జపనీస్ టీ తాగేసి..

Mla Mallareddy Summer Trip Japan Brs Medchal Mla Japan Mallareddy Min

Japan Mallareddy : చామకూర మల్లారెడ్డి కాస్తా జపాన్ మల్లారెడ్డిగా మారిపోయారు. ఆయన తన వేషధారణను పూర్తిగా జపనీస్ స్టైల్‌లోకి మార్చారు. మల్లారెడ్డి సతీమణి కూడా జపనీస్ మహిళామణుల వస్త్రధారణలో మెరిసిపోయారు. ఫొటోలకు ఫోజులిస్తూ ఇద్దరూ చిరునవ్వులను చిందించారు. సమ్మర్ వేళ టూర్ కోసం సతీసమేతంగా మల్లారెడ్డి జపాన్‌కు వెళ్లారు. ఇప్పుడు జపాన్‌లోని వివిధ నగరాల్లో ఆయన తిరుగుతున్నారు. అక్కడి పర్యాటక ప్రదేశాలన్నీ కళ్లారా చూస్తున్నారు. ప్రత్యేకమైన జపనీస్ వంటకాల రుచులన్నీ మల్లారెడ్డి ఆస్వాదిస్తున్నారు. జపనీస్ ప్రజలతోనూ జోకులు వేస్తూ.. సందడి చేస్తున్నారు. తాను ఎక్కడుంటే అక్కడ ఆనందం, చిరు నవ్వులు విరబూయాల్సిందే అని మల్లారెడ్డి చాటుకుంటున్నారు.

Also Read :Ranas Interrogation: తహవ్వుర్ రాణా విచారణ షురూ.. ఎన్ఐఏ అడిగిన ప్రశ్నలివీ

జపనీస్ టీలను తాగిన మల్లారెడ్డి

తాజాగా జపాన్ రాజధాని టోక్యో నగరంలో జరిగిన జపనీస్ ట్రెడిషనల్ టీ కార్యక్రమంలో మల్లారెడ్డి(Japan Mallareddy) దంపతులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారిద్దరూ వెరైటీ డ్రెస్సుల్లో కనిపించారు. జపనీస్ ట్రెడిషనల్ టీలను తాగి, వాటి టేస్ట్ ఎలా ఉందనే దానిపై మల్లారెడ్డి దంపతులు ఫీడ్ బ్యాక్ ఇచ్చారట. ఇక మల్లారెడ్డి బుల్లెట్ ట్రైన్ ఎక్కి కొద్ది దూరం ట్రావెల్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను  ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయ్యాయి.

Also Read :Samanthas Remarriage: స‌మంత రెండో పెళ్లి.. వరుడు ఆయనేనా ?

చంద్రబాబు విక్టరీ సింబల్‌‌ను చూపించడంతో.. 

తాజాగా వైరల్ అయిన ఒక ఫొటోలో మల్లారెడ్డి చేతిని పరిశీలిస్తే..  ఆయన చంద్రబాబు తరహాలో రెండు చేతి వేళ్లను(విక్టరీ సింబల్) చూపించారు.  దీంతో మల్లారెడ్డి టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ పెట్టారు. గతంలో ఓ దశలో సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో సైతం మల్లారెడ్డి ప్రత్యక్షమయ్యారు. దీంతో మల్లారెడ్డి హస్తం పార్టీలో చేరడం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే దాని తర్వాత పార్టీలో చేరికపై ఎలాంటి ఊసే బయటకురాలేదు. ఏప్రిల్ 27న వరంగల్ నగరం వేదికగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఉంది. దీన్ని కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అప్పటిలోగా జపాన్ టూర్ ముగించుకొని మల్లారెడ్డి హైదరాబాద్‌కు తిరిగి వస్తారని తెలిసింది.