Site icon HashtagU Telugu

MLA Kaushik Reddy House Arrest : ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గృహనిర్బంధం

Padi Kaushik Reddy House Ar

Padi Kaushik Reddy House Ar

MLA Kaushik Reddy House Arrest : హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ని పోలీసులు గృహనిర్బంధం (MLA Kaushik Reddy House Arrest) చేసారు. బుధువారం కౌశిక్ రెడ్డి.. బిఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల ఫై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు చీర , గాజులు వేసుకొని తిరగాలని..అవి తానే స్వయంగా పంపిస్తానని అనడం, గురువారం ఉదయం గాంధీ నివాసానికి వెళ్లి ఆయన ఇంటిపై గులాబీ జెండా ఎగరవేసి అక్కడి నుండి తెలంగాణ భవన్ కి వచ్చి ప్రెస్ మీట్ పెడతానని ప్రకటించాడు.

ఈ తరుణంలో పోలీసులు కొండాపూర్ లోని కౌశిక్ ఇంటికి పెద్ద ఎత్తున చేరుకొని ఆయన్ను గృహనిర్బంధం చేసారు. గాంధీ ఇంటికి వెళ్లకుండా ఉండేందుకే కౌశిక్ రెడ్డిని ఇంటి వద్ద పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అటు గాంధీ కౌశిక్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దమ్ముంటే నా ఇంటికి రా.. లేదంటే నేనే నీ ఇంటికి వస్తాను అంటూ సవాల్ విసిరారు. ఇలా ఇరు నేతల సవాళ్ల మధ్య ఎలాంటి గొడవలు జరుగుతాయో అని ముందు జాగ్రత్తగా పోలీసులు నిర్బంధం చేసారు.

ఇక పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను మహిళలను కించపరిచేలా ఉండంతో కాంగ్రెస్ మహిళా నేతలు గాందీ భవన్ (Gandhi Bhavan) లో ప్రెస్ మీట్ పెట్టి పాడి కౌశిక్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చీర, గాజులు పంపడం అంటే ఏమిటని.. మహిళలను చేత కాని వాళ్లగా చెబుతున్నారా అని ప్రశ్నించారు. మహిళల్ని కించ పరిచేలా మాట్లడితే చెప్పుదెబ్బలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి (Congress Leader Shobha Rani)పాడి కౌశిక్ రెడ్డికి షూ చూపించారు.

పాడి కౌశిక్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలి

మరోసారి చీరలు గాజులు చూపిస్తే కౌశిక్ రెడ్డి చెప్పు దెబ్బలు తినాల్సి వస్తుందని హెచ్చరించారు. మిస్టర్ కౌశిక్ రెడ్డి.. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మహిళలను అవమానించేలా బీఆర్ఎస్ నేతలు పదే పదే మాట్లాడటం వల్లే తాము చెప్పు చూపించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన పాడి కౌశిక్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని అలాగే, పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని ఆయనను విచారణకు పిలవాలని డిమాండ్ చేశారు.

కౌశిక్ దూకుడు బిఆర్ఎస్ కు కొత్త సమస్యలు

పాడి కౌశిక్ రెడ్డికి పాడె ఎక్కే సమయం వచ్చిందని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత మండిపడ్డారు. భార్య, కుమార్తెలతో ఆత్మహత్యలు చేసుకుంటానని బెదిరించి కౌశిక్ రెడ్డి గెలిచాడని అన్నారు. కౌశిక్ వెంటనే క్షమాపణలు చెప్పాలని..చెప్పే వరకూ మహిళలతో నిరసనలు నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇటు కౌశిక్ తీరు ఫై బిఆర్ఎస్ నేతలు సైతం కాస్త ఆగ్రహంగానే ఉన్నట్లు తెలుస్తుంది. కౌశిక్ రెడ్డి వ్యవహారం బీఆర్ఎస్ కు మొదటి నుంచి ఇబ్బందిగానే మారింది. ఆయన దూకుడు పార్టీకి ఏ మాత్రం మేలు చేయకపోగా కొత్త సమస్యలు తెచ్చిపెడుతుంది. ఇప్పుడు పార్టీలకు అతీతంగా మహిళా నేతలంతా మండిపడేలా ఆయన వ్యాఖ్యలను.. సొంత పార్టీ మహిళా నేతలు కూడా సమర్థించే అవకాశం లేకుండా పోయింది. మొత్తం మీద కౌశిక్ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదం అవుతున్నాయి.

Read Also :  North Korea : మరోసారి మిస్సైళ్లు పరీక్షించిన కిమ్.. దక్షిణ కొరియా, జపాన్‌లలో హైఅలర్ట్