Telangana Assembly Session 2023: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్, విపక్ష పార్టీ సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాసనసభ వాయిదా పడిన అనంతరం హరీశ్ రావు అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో అబద్ధాలు చెప్పినట్లే అసెంబ్లీలో కూడా అబద్ధాలు చెప్పారన్నారని విమర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడని మండిపడ్డారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిరోజే ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేశారన్నారు హరీష్ రావు. సీఎం రేవంత్‌రెడ్డి గంటన్నర సేపు మాట్లాడారని చెప్పిన ఆయన, స్పష్టత ఇవ్వడానికి మాకు అవకాశం ఇవ్వలేదన్నాడు. ఈ నేపథ్యంలో మాట్లాడేందుకు ప్రయత్నించగా కేవలం మూడు నిమిషాల వ్యవధిలో మూడుసార్లు మైక్ కట్ చేశారని వాపోయారు హరీష్. అధికార పార్టీ కాంగ్రెస్ పూర్తిగా అప్రజాస్వామికంగా వ్యవహరించిందని ఆవేదన చెందారు.
భారతదేశం అమరవీరులను గౌరవిస్తుంది. ప్రతి సంవత్సరం నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవాలలో అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానిస్తాము. సచివాలయం ముందు అమరవీరుల స్మారక స్థూపాన్ని నిర్మించాం. ఈ ఘనత అంతా కేసీఆర్‌కి, భారత దేశానికే చెందుతుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని రేవంత్ రెడ్డి అడుగడుగునా వ్యతిరేకించారని సంచలన ఆరోపణలు చేశారు హరీష్. కాబట్టి తెలంగాణ ఉద్యమకారుల గురించి.. అమరవీరుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారాయన.
Also Read: Mahesh : గుంటూరు కారం ఏం చేసినా ఫ్యాన్స్ కి నచ్చట్లేదు..!