BRS faults Telangana Govt’s decision : పీఏసీపై బీఆర్ఎస్‌కు మాట్లాడే అర్హతే లేదు – దానం నాగేందర్

PAC Chairman Post : అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్‌ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని, గతంలో ఎన్నడూలేనివిధంగా సభా సంప్రదాయాలు, సభా మర్యాదలు, సభా నియమావళిని పట్టించుకోకుండా అరికెపూడి గాంధీని పీఏసీ చైర్మన్‌గా నియమించిందని బిఆర్ఎస్ ఆరోపిస్తుంటే..

Published By: HashtagU Telugu Desk
Pac Chairman Post

Pac Chairman Post

BRS faults Telangana Govt’s decision to appoint defected MLA as PAC Chairman : ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌ (PAC Chairman Telangana) పదవిని బీఆర్‌ఎస్‌ (BRS) నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ (Arekapudi Gandhi)కి కట్టబెట్టడం ఫై బిఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య తీవ్ర వివాదాస్పదమైంది. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్‌ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని, గతంలో ఎన్నడూలేనివిధంగా సభా సంప్రదాయాలు, సభా మర్యాదలు, సభా నియమావళిని పట్టించుకోకుండా అరికెపూడి గాంధీని పీఏసీ చైర్మన్‌గా నియమించిందని బిఆర్ఎస్ ఆరోపిస్తుంటే..పీఏసీ పదవి గురించి బిఆర్ఎస్ మాట్లాడే అర్హత లేదని కాంగ్రెస్ విమర్శిస్తోంది.

తాజాగా ఈ అంశం ఫై ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) స్పందించారు. గతంలో కాంగ్రెస్‌కు కాకుండా ఎమ్ఐఎమ్‌కు ఇచ్చారని గుర్తుచేశారు. అసలు పీఏసీపై బీఆర్ఎస్‌కు మాట్లాడే అర్హతే లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే హైకోర్టు ఫిరాయింపుల ఫై ఇచ్చిన తీర్పు ఫై కూడా దానం రియాక్ట్ అయ్యారు. హైకోర్టు తీర్పును స్వాగతించారు. న్యాయ నిపుణులతో చర్చించి ముందుకు వెళ్తామని అన్నారు.

బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు (Disqualification Of MLAs ) వేసేలా ఆదేశాలివ్వాలని బిఆర్ఎస్ , బీజేపీలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. స్పీకర్‌ అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు సోమవారం తీర్పు (High Court Verdict) తీర్పునిచ్చింది. నాలుగు వారాల్లో దీనిపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా స్వీకరించి విచారణ చేపడుతామంది.

Read Also : Blood Cancer Awareness: బ్ల‌డ్ క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాలివే..? ఈ ప‌రీక్ష‌లు చాలా ముఖ్యం..!

  Last Updated: 10 Sep 2024, 12:23 PM IST