Site icon HashtagU Telugu

Mission Bhagiratha: విషాద ఉదంతం, మిషన్ భగీరథ ఉద్యోగిని ఆత్మహత్య

Suicide

Suicide

తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సరైన సమయంలో జీతాలు రాక, ఉన్న జీతాలు సరిపోక అవస్థలు పడుతున్నారు. తాజాగా మిషన్ భగీరథ ప్రాజెక్టులో నీటి శుద్ధి కేంద్రంలో కాంట్రాక్టు ఉద్యోగినిగా పని చేసే పుష్పలత ఆత్మహత్య చేసుకున్నారు. చాలీచాలని జీతంతో పిల్లల్ని సాకలేకపోతున్నట్లుగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా హాలియాలో చోటు చేసుకున్న ఈ విషాద ఉదంతం గురించి చూస్తే.. ప్రభుత్వం చెప్పే గొప్పల వెనుక ఇన్ని కష్టాలు ఉన్నాయా? అన్న భావన కలుగక మానదు. తిరుమలగిరిసాగర్ మండలానికి చెందిన అల్వాల గ్రామానికి చెందిన పుష్పలత భర్త మహేశ్.. పానగల్ మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తుండేవాడు. వీరికి ఒక పాప.. ఒక కుమారుడు ఉన్నారు.

అయితే.. చాలీచాలని జీతంతో ఇబ్బందులు పడుతూ.. ఆర్థిక సమస్యల నుంచి బయటకు రాలేక ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో.. భర్త ఉద్యోగాన్ని పుష్పలతకు ఇచ్చారు. తాజాగా ఆమె సైతం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసుకున్న సూసైడ్ నోట్ లో నెలకు రూ.9500 జీతంతో చాలీచాలని బతుకును గడపటం కష్టంగా ఉందని.. ఆ జీతం డబ్బులు కూడా సకాలంలో రాకపోవటంతో ఇబ్బందులు పడుతున్నట్లుగా పేర్కొంది.

కేసు దర్యాప్తులో భాగంగా ఆమె పుస్తకంలో రాసిన సూసైడ్‌ నోట్‌ బయటపడింది. దానిలో తన జీతం రూ.9500 చాలకపోవడం, అది కూడా సమయానికి అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొంది. అలాగే తాను ఆనారోగ్యంతో బాధపడుతున్నట్లు కూడా లేఖలో రాసుకొచ్చింది. కడుపులో గడ్డ ఉన్నట్లు దానికి తొలగించడానికి దాదాపు రూ.2 లక్షలు ఖర్చు అవుతుందని తన లేఖలో పేర్కొంది.

Also Read: Exclusive: భారీ అంచనాలు రేపుతున్న SSMB29, రాజమౌళి-మహేశ్ సినిమాలో 3 బాలీవుడ్ స్టార్స్

Exit mobile version