ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్న థాయ్‌లాండ్ మోడల్ ఓపల్ సుచాత (Miss World Opal Suchatha) తెలంగాణలో మహిళల భద్రతపై ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ వేదికగా జరిగిన 72వ మిస్ వరల్డ్ పోటీలో విజేతగా నిలిచిన ఓపల్, తెలంగాణ ప్రభుత్వ భద్రతా చర్యలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. “ఇక్కడ నాకు మొదటి రోజు నుండి చివరి వరకు మహిళా పోలీసులు నా పక్కనే ఉండి రక్షణగా ఉండడం గొప్ప అనుభూతి” అని ఆమె పేర్కొన్నారు.
Nara Lokesh : ఆ విద్యార్థులకు కూడా తల్లికి వందనం.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన
ఓపల్ తన దేశమైన థాయ్‌లాండ్‌లో మహిళా పోలీసులు అరుదుగా కనిపిస్తారని, అక్కడ ప్రధానంగా మగవాళ్లే పోలీసులుగా పనిచేస్తారని తెలిపారు. కానీ తెలంగాణలో ఎయిర్‌పోర్టులో దిగిన దగ్గరనుంచి తిరిగి వెళ్లేంతవరకు మహిళా పోలీసులు తనకు కంటికి రెప్పలా రక్షణగా ఉండటం ఆశ్చర్యాన్నిచేసిందని చెప్పారు. “ఇలాంటి వ్యవస్థలు మహిళల్లో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి” అంటూ పేర్కొన్నారు.
Fungal Infection: ఫంగల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి!
తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ.. ఓపల్ సుచాత ఇలాంటి మహిళా భద్రతా మోడల్నే తమ దేశం థాయ్‌లాండ్‌లోనూ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరతానని చెప్పారు. మహిళలకు భద్రత కల్పించడంలో తెలంగాణ చూపిన ప్రగతిని ప్రపంచానికి చూపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మిస్ వరల్డ్ 2025 విజేతగా ఓపల్ సుచాతకు క్రిస్టినా పిజ్కోవా కిరీటాన్ని అలంకరించగా, ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వైఖరికి ప్రపంచ గుర్తింపు తీసుకురావడమే కాక, ఇతర దేశాలకు కూడా మార్గదర్శకంగా నిలిచే అవకాశముంది.