Site icon HashtagU Telugu

Miss World 2025 : సుందరీమణులు వస్తున్నారని చిరు వ్యాపారులను రోడ్డున పడేస్తారా..? – కేటీఆర్

Demolitions Wgl

Demolitions Wgl

వరంగల్ కు మిస్ వరల్డ్ 2025 సుందరీమణులు (Miss World 2025 beauties) వస్తున్నారని చెప్పి అధికారులు చేపట్టిన చర్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాజీపేట, హనుమకొండ, వరంగల్ పరిధిలో రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారుల దుకాణాలను అధికారులు కూల్చివేయడం(demolitions )తో వ్యాపారులు రోడ్డున పడ్డారు. ఎంతో కాలంగా పూట గడుపుతున్న వారిని ముందస్తు సమాచారం లేకుండా తరిమేయడం పట్ల స్థానిక ప్రజల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.

Rohit Sharma : రోహిత్ రాజకీయాల్లోకి వస్తున్నారా ? సీఎంతో భేటీ అందుకేనా?

ఈ ఘటనపై బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత కేటీఆర్ (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “సుందరీమణులు వస్తున్నారని పేదల జీవనాధారమైన దుకాణాలను తొలగించడమా?” అంటూ ప్రశ్నించారు. “బుల్డోజర్ కంపెనీలతో ప్రభుత్వం రహస్య ఒప్పందాలు చేసుకుందా?” అని వ్యాఖ్యానించిన కేటీఆర్, పేదల ఇళ్లు, చిన్నచిన్న వ్యాపారాల కూల్చివేతలు అన్యాయమని ఫైర్ అయ్యారు. బలహీన వర్గాలపై ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు.

“మిస్ వరల్డ్ లాంటి అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహించడం తప్పు కాదు, కానీ వాటి కోసం పేదల భవిష్యత్తును తుంచేయడం అన్యాయం” అన్నారు. ప్రభుత్వం తన ప్రచారానికి తెర వేసేందుకు పేదల జీవితాలతో చెలగాటం ఆడకూడదని హెచ్చరించారు. అంతేకాదు, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో నూతన దిశగా చర్చలకు దారితీస్తోంది.