తెలంగాణ కొత్త మంత్రివర్గం(New Cabinet)లో కొత్తగా ముగ్గురికి చోటు దక్కింది. రాష్ట్ర మంత్రులుగా అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి హైదరాబాద్ రాజ్‌భవన్‌లో ఈరోజు గవర్నర్ జిష్ణుదేవ్‌వారి (Governor Jishnu Dev Ari) సమక్షంలో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth) పాల్గొని నూతన మంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ముగ్గురు మంత్రులూ అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో అనుభవం కలిగినవారే కావడం విశేషం.
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే? దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి రాజకీయ ప్రస్థానం చూస్తే.. విద్యార్థి రాజకీయాల నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1990-93 మధ్య మక్తల్ NSUI అధ్యక్షుడిగా, తరువాత మక్తల్ మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా, జిల్లా వైస్ ప్రెసిడెంట్, జడ్పీటీసీ సభ్యుడిగా, నారాయణపేట డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2023 ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఇప్పుడు మంత్రిగా ప్రమాణం చేశారు. ప్రజలతో నేరుగా సంబంధాలు, గ్రామీణ స్థాయిలో అనుభవం ఆయనను ఈ స్థాయికి చేర్చాయి.
MLA Maganti Gopinath Dies : గోపీనాథ్ భౌతిక కాయాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న కేసీఆర్
చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి రాజకీయ ప్రస్థానం చూస్తే.. మరింత వైవిధ్యంగా ఉంది. ప్రముఖ నాయకుడు వెంకటస్వామి (కాకా) కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2009లో పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. ఆపై కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ వంటి ప్రధాన పార్టీల్లో పనిచేశారు. 2017లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2023లో తిరిగి కాంగ్రెస్‌లో చేరి చెన్నూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
అలాగే ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ విషయానికి వస్తే.. తన రాజకీయ ప్రయాణాన్ని 1982లో NSUI అధ్యక్షుడిగా ప్రారంభించారు. అనేక ఎన్నికల్లో పోటీ చేసి చివరికి 2023లో విజయం సాధించి ఇప్పుడు మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ ముగ్గురు నేతలు అందరూ తెలంగాణ కొత్త పాలనలో కీలక పాత్ర పోషించనున్నారు.