Key Advice To farmers: రైతులు వ్యవసాయ అనుబంధ పథకాలను లబ్ధి పొంది ఆర్థిక వృద్ధి చెందాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Key Advice To farmers) ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకోసం హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న 42 రైతు వేదిక క్లస్టర్ల ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. హుస్నాబాద్ మండలంలోని మీర్జాపూర్ లో మొదటి అవగాహన సదస్సు నిర్వహించారు. హుస్నాబాద్ కరువు పీడిత ప్రాంతమని కరువుల్లో రైతులు ఆదుకునేందుకు పశువులు మాత్రమే అడుకుంటాయని తెలిపారు. రైతు వేదికల్లో అవగాహన ద్వారా నిరుద్యోగ యువత ,రైతులు స్వయం శక్తి ద్వారా స్వయంగా ఎదగడానికి తొడ్పడుతుందన్నారు.సదస్సులో జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, జిల్లా అధికారులు ,మండల వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. గ్రామ క్లస్టర్ పరిధిలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొని వారి సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
రైతులు తమ పొలాల్లో ఆయిల్ ఫాం, డ్రాగన్ ,పండ్ల తోటలు, కూరగాయలు తదితర పంటలకు అవకాశం ఇవ్వాలని ఆదాయం అధికంగా వస్తుందని అధికారులు రైతులకు సూచనలు చేశారు. ఆయిల్ ఫాం లో అంతర్ పంట సాగు చేయడానికి ఎకరానికి 4200 ఇవ్వడంతో పాటు ఫర్టీలైజర్స్ అందిస్తున్నారు. పట్టు పరిశ్రమల ద్వారా ఆదాయం భారీగా ఉంటుందని తెలిపారు. ఈ పంట అతివృష్టి ,అనావృష్టి వచ్చిన పంటకు ఇబ్బందులు ఉండవని అటవీ పందులు,జంతువుల బెడద ఉండదన్నారు. పట్టు పురుగులు ప్రారంభం అయిన తరువాత నెల రోజుల్లోనే పంట వస్తుందన్నారు.
వెటర్నరీ లో భాగంగా మంచి పథకాలు ఉన్నాయని వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు. గొర్రెల పెంపకంలో 500 గొర్రెలు ,25 పొట్టేలు ఒక యూనిట్ గా 5 ఎకరాల భూమి కలిగి ఉండి కోటి రూపాయల స్కీమ్ లో 50 లక్షల సబ్సిడీ మిగిలిన దానిలో బ్యాంక్ లోన్ తో పాటు కొంత రైతు చెల్లించుకునే స్కీమ్ చాలా బాగుంటుందని అధికారులు రైతులకు సూచించారు. ఇందులోనే తక్కువలో 100 గొర్రెలు, 5 పొట్టేలు, ఒక యూనిట్ గా 20 లక్షల స్కీమ్ లో 10 లక్షల సబ్సిడీ రాగ మిగిలిన దానిలో బ్యాంక్ లోన్, రైతు స్వయంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
కోళ్ళ పెంపకంలో నాటు కోళ్లు , కడక్ నాథ్ కోళ్లు 1000 పెట్టెలు ,20 పుంజులు ఒక యూనిట్ గా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకం ఉందని దానిని ఉపయోగించుకోవాలని సూచించారు. పాడి పశువుల పెంపకానికి లక్ష నుండి 20 లక్షల మధ్య ఒక యూనిట్ గా ఉన్న పథకాలకు కేంద్రం సబ్సిడీ అందించే పథకాలు ఉన్నాయని రైతులు వారికి నచ్చిన పశువులు కొనుక్కోవచ్చు. ఉపాధి హామీ పథకం లో భాగంగా ఆయిల్ ఫాం, డ్రాగన్ ,మునగ ,కొబ్బరి , మల్బరీ, మామిడి తోటల పెంపకానికి పశువుల పాక, పందుల షెడ్డు కు ఆర్థిక సహకారం ఉంటుందని సూచించారు. దీనికి జాబ్ కార్డు కచ్చితంగా ఉండాలన్నారు.
Also Read: Uttar Pradesh: జేపీ నడ్డా పేరుతో ఎమ్మెల్యే నుంచి రూ.1.25 లక్షల డిమాండ్, నిందితుడు అరెస్ట్
గ్రామాల్లో చెరువుల్లో చేప పిల్లలు వేసి చేపల పెంపకం చేయవచ్చని సొంతంగా పంటకు పనికి రాని భూములను చేపల చెరువులుగా మార్చి అక్కడ చేపల పెంపకం చేయవచ్చని తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ వైఎస్ఆర్ హయంలో ప్రారంభిస్తే త్వరలోనే మేము పూర్తి చేస్తామని తమ ప్రభుత్వం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి కాలువల నిర్మాణానికి 437 కోట్ల రూపాయలు కేటాయించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గౌరవెల్లి నీళ్ళు అందేలోపే రైతులు వ్యవసాయదారిత ఇతర ఆదాయ వనరులపై దృష్టి సారించాలన్నారు. మహిళలకు తమ ప్రభుత్వం ప్రత్యేక పథకాలు తీసుకొచ్చిందని 10 లక్షల భీమా సౌకర్యం కల్పించిందన్నారు. మహిళా సంఘాలకు 20 లక్షల వరకు లోన్ తీసుకొని ఒక్క సభ్యురాలు కు 2 లక్షల వరకు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. క్లస్టర్ పరిధిలో సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవాలని డ్రింకింగ్ వాటర్ కలుషితం కాకుండా చూసుకోవాలని తెలిపారు.
కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి మాట్లాడుతూ.. గొర్రెలు, ఆవులు, ఆయిల్ ఫాం, డ్రాగన్ తదితర వాటికి సబ్సిడీ ఉన్నాయని రైతులు ఉపయోగించుకోవాలని సూచించారు. ఏఏ పథకానికి బ్యాంక్ లోన్‌కి అవసరమైన షీట్ ను రూపొందిస్తామని తెలిపారు. రైతు రుణమాఫీ ఇప్పటికే లక్ష 50 వేల రూపాయల వరకు రైతు రుణమాఫీ పూర్తయిందని, ఎవరికైనా ఇబ్బంది ఉంటే AEOలకు వివరాలు ఇవ్వాలన్నారు. రైతు వేదికల వద్ద ఈ అవగాహన సదస్సు ఉపయోగించుకోవాలని సూచించారు. సమావేశంలో వివిధ విభాగాల జిల్లా అధికారులు, మండల అధికారులు పాల్గొన్నారు.